AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ఇజ్జత్ అంతా పోయింది..! పెళ్లివేదికపైనే పెళ్లి కొడుకు చెంపలు వాయించిన పెళ్లి కూతురు..!

ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Video Viral: ఇజ్జత్ అంతా పోయింది..! పెళ్లివేదికపైనే పెళ్లి కొడుకు చెంపలు వాయించిన పెళ్లి కూతురు..!
Bride Groom Fighting
Balaraju Goud
|

Updated on: Nov 29, 2024 | 12:51 PM

Share

పెళ్లి వేడుకల్లో నవ్వులు, పూవ్వులు సర్వసాధారణం, అయితే కొన్నిసార్లు ఇలాంటి సంఘటనలు కెమెరాలో బంధించబడడం షాకింగ్‌గా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజా వైరల్ అవుతున్న ఈ వీడియోను చూడండి. జయమాల ముగిసిన వెంటనే వధూవరుల మధ్య ఏదో విషయంలో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత విషయం ముదిరిపోయి ఇద్దరూ ఒకరినొకరు ఎడాపెడా వాయించేసుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ఇరువైపుల బంధువులు వేదికపై ఉన్న అతిథులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

వైరల్ అవుతున్న వీడియోలో, ఏదో చిన్న విషయానికి వధూవరుల మధ్య వాగ్వాదం మొదలై, అది వెంటనే తీవ్ర వివాదంగా మారింది. దీని తరువాత, జయమాల వేదికపై డ్యాన్స్ చేసిన వధూవరులు ఒకరినొకరు కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇంతలో, కలగజేసుకున్న బంధువులు వారిని విడిపించడానికి ప్రయత్నించారు. కాని వారు ఆగలేదు. వారి పోరాటాన్ని కొనసాగించారు.

వధూవరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన వీడియోను ఇక్కడ చూడండి..

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కొందరు దీనిని హాస్యాస్పదంగా తీసుకున్నారు. చాలా మంది వినియోగదారులు దీనిని దురదృష్టకరంగా భావిస్తున్నారు. ఈ వీడియో @bridal_lehenga_designn అనే ఖాతాతో Instagramలో షేర్ చేశారు. ‘ఇదంతా ఏమిటి భయ్యా’ అని వినియోగదారు క్యాప్షన్ ఇచ్చారు. కొన్ని సెకన్ల ఈ క్లిప్ వేగంగా వైరల్ అవుతోంది. అదే సమయంలో, వీడియోను చూసిన తర్వాత, వినియోగదారులు వారి ప్రతిచర్యలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..