AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదెక్కడి పిచ్చి రా బాబు.. వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ నిప్పంటించుకున్న వధూవరులు.. చివరకు..

తాజాగా ఓ వధూవరులు చేసిన ఫోటోషూట్ చూస్తే నోరేళ్లాబెట్టాల్సిందే.. వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం ఏకంగా వారికి వారే నిప్పంటించుకుని పరిగెత్తారు.

Viral Video: ఇదెక్కడి పిచ్చి రా బాబు.. వెడ్డింగ్ ఫోటోషూట్ అంటూ నిప్పంటించుకున్న వధూవరులు.. చివరకు..
Viral Video
Rajitha Chanti
|

Updated on: May 13, 2022 | 1:43 PM

Share

ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. ఇప్పుడు ఇదే ట్రెండ్.. పెళ్లికి ముందు వధూవరులు అందమైన లొకేషన్లలో ఫోటోషూట్ చేసుకుంటుంటారు. ఇటీవల ఈ ఫోటోషూట్స్ కొన్నిసార్లు ప్రాణాల మీదకు వస్తుంటాయి.. చిత్ర విచిత్రమైన ఫోజులతో.. ప్రమాదకరమైన స్టంట్స్‏తో ఫోటోషూట్స్ చేస్తుంటారు. తాజాగా ఓ వధూవరులు చేసిన ఫోటోషూట్ చూస్తే నోరేళ్లాబెట్టాల్సిందే.. వెడ్డింగ్ ఫోటో షూట్ కోసం ఏకంగా వారికి వారే నిప్పంటించుకుని పరిగెత్తారు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో వధూవరులు ఇద్దరూ తమ చేతులలో పూల బోకేలు పట్టుకుని పరిగెత్తారు.. ఆ తర్వాత వారి మంటలు వ్యాపించి ఇద్దరి శారీరాలకు మంటలు వ్యాపించాయి.. దీంతో వారు వెంటనే పరిగెత్తడం ప్రారంభంచడంతో.. వారికి ఎదురుగా ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీశాడు.. కాస్త దూరం పరిగెత్తిన తర్వాత ఇద్దరు నెలపై పడిపోవడం.. మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి మంటలను ఆర్పేశారు. ఈ వీడియోను ఫేమస్ డీజే, వెడ్డింగ్ ఫోటో గ్రాఫర్ అయిన రస్ పావెల్ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. దానికి ఇద్దరు స్టంట్ వర్కర్స్ పెళ్లి చేసుకుంటే అనే క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాదు.. వధూవరుల ఫోటో షూట్ నిపుణుల పర్యవేక్షణలో జరిగిందని.. వారి శరీరాలకు యాంటీ బర్న్ జెల్ ఉందని..అలాగే వధువు జుట్టు పై విగ్ అమర్చినట్లు చెప్పుకోచ్చాడు.. వధూవరులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ఈ స్టంట్ ఎవరు ప్రయత్నించవద్దని తెలిపాడు.. ప్రస్తుతం వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

View this post on Instagram

A post shared by Times Now (@timesnow)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Vijay Devarakonda: నా కెరీర్‏లోనే అత్యంత పెద్ద సినిమా ఇదే.. ఆసక్తికర వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ..

Sivakarthikeyan: పాన్ ఇండియా చిత్రాలపై స్పందించిన తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్.. అలా ఉంటేకే నటిస్తాంటూ..

Kamal Haasan: క్రేజీ కాంబో.. కమల్ సినిమాలో హీరో సూర్య ?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..

Gurthunda Sheethakalam: ఎట్టకేలకు  విడుదలకు సిద్ధమైన ఫీల్ గుడ్ లవ్‏స్టోరీ.. థియేటర్లలో సందడి చేయనున్న గుర్తుందా శీతాకాలం..