దురాశ దుఃఖానికి చేటు అని పెద్దలు చెప్పిన మాట మన చిన్నతనం నుంచి వింటూనే ఉన్నాం.. అత్యాశకు మృత దేహాలను వాడేసుకుంటున్నారు కొంతరు కంత్రీ కక్కుర్తి మనుషులు. ఇలాంటి ఉదంతం బ్రెజిల్‌లో వెలుగు చూసింది. ఇక్కడ ఓ మహిళ డెడ్ బాడీని షురిటీగా చూపించి అప్పు తీసుకునేందుకు బ్యాంకుకు వెళ్లింది. బ్యాంకు కూడా ఆమె లోన్ అప్రూవ్ చేసింది. కానీ, పాపం పండింది అన్నట్టుగా.. మహిళ ఖాతాలోకి డబ్బులు వెళ్లకముందే ఆమె చేసిన మోసం బయటపడింది. పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…
రియో డి జెనీరోలో ఒక మహిళ బ్యాంకు వచ్చింది. సదరు బ్యాంకు నుంచి 3 వేల డాలర్లు అంటే దాదాపు రూ. 2.50 లక్షల రుణం అప్లై చేసింది. లోన్ కోసం షురిటీ సంతకం అవసరం. అందుకు ఆ మహిళ చనిపోయిన వ్యక్తిని తన మామగా దత్తత తీసుకుని వీల్ చైర్‌లో బ్యాంకుకు తీసుకువచ్చింది.. ఓ పేపర్‌పై సంతకం చేసేందుకు చనిపోయిన వ్యక్తి చేతి వేళ్లలో పెన్ను పెట్టేందుకు మహిళ ప్రయత్నించడం వీడియోలో కనిపిస్తోంది. ఆ వ్యక్తి సజీవంగా ఉన్నాడని ప్రజలు భావించేలా ఆమె అతనితో ఏదో మాట్లాడుతున్నట్టుగా ప్రవర్తించింది. ఈ సమయంలో అక్కడే ఉన్న ఒక వ్యక్తి ఈ మొత్తం ఘటనను వీడియో తీశాడు. ఎట్టకేలకు సదరు మహిళ చేసిన మోసం బట్టబయలు కావడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
A woman in Brazil took a deceased man to the bank in an attempt to secure a loan 😳 pic.twitter.com/abiO2evgwg
— More Crazy Clips (@MoreCrazyClips) April 17, 2024
వైరల్ అవుతున్న వీడియోలో చనిపోయిన వ్యక్తిని సంతకం చేయమని మహిళ అడుగుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో వీల్ చైర్‌పై కూర్చున్న వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదని బ్యాంకు ఉద్యోగితో చెప్పింది సదరు కిలేడీ. తన మామ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని చెప్పింది. అందుకే అతని పరిస్థితి ఇలా ఉందని వారిని బురిడీ కొట్టించింది. కానీ, ఎట్టకేలకు దొరికిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..