Brain Teaser Of The Day with Solution for Kids and Adults: బ్రెయిన్ టీజర్లు మనలోని తార్కిక జ్ఞానానికి పదును పెడతాయి. ఫలితంగా ఏకాగ్రతను మెరుగుపరచుకోవచ్చు. నిజానికి బ్రెయిన్ టీజర్లనేవి పిల్లల ఆటలని కొట్టిపారేస్తే అంతకంటే పిచ్చితనం మరొకటి ఉండదు. ఎందుకుంటే వీటిని పరిష్కరించడం అంత సులువుకాదు. వీటని పిల్లలతోపాటు పెద్దలు కూడా ప్రయత్నించవచ్చు. వీటిని తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మెదడు షార్ప్ అవ్వడమేకాకుండా మనసుకు కూడా ఎక్సర్‌సైజ్‌లా పనిచేస్తాయి. ఇక్కడ ఇచ్చిన ఇమెజ్ అలాంటిదే. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఈ ఫిజిల్‌ను పరిష్కరించడంలో చాలా మంది విఫలమయ్యారు. మీరూ ప్రయత్నించండి..
ఈ పిక్చర్‌లో అగ్గిపుల్లలతో తయారు చేసిన డయాగ్రాం కనిపిస్తుంది కదా! దీనిలో ఏవైనా 4 అగ్గిపుల్లలను జరిపి మూడు చతురస్రాలను రూపొందించాలి. ఆలోచించండి.. ప్రయత్నించకుండా ముందే ఓటమిని అంగీకరించడం పిరికివాళ్ల లక్షణం. మీలోని లాజికల్ రీజనింగ్‌కు కాస్త పనిచెప్పి ఈ అగ్గిపుల్లల పజిల్‌ని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఆన్సర్ రావట్లేదా? మీకో చిన్న క్లూ. బ్రెయిన్ టీజర్లకు ఎప్పుడూ ఒకే విధమైన సమాధానాలు వస్తాయను కోవడం కేవలం అపోహ మాత్రమే. లాజిక్ ఉంటే ఆన్సర్ భిన్న రూపాల్లో దర్శనమిస్తుంది. ఇప్పడు ప్రయత్నించండి. సరే.. మీకు ఇప్పటికీ ఆన్సర్ దొరకనట్లయితే ఈ కింద ఇచ్చిన ఇమేజ్ చూడండి.