ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు.. మెదడుకు మేత వేస్తూ.. మనకు సవాళ్లు విసురుతాయి. ఇలాంటి పజిల్స్ అంటే ఎంతోమందికి ఇష్టముంటది. ఇది సోషల్ మీడియా యుగం.. అంతా ఇంటర్నెట్‌పైనే నడుస్తుంది. ఏ విషయమైనా క్షణాల్లో వైరల్ అవుతది. అవి వీడియోలు కావచ్చు, ఫోటో పజిల్స్ లేదా ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కావచ్చు.. నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి.
ఏ ఇద్దరూ ఓ ఫోటోను ఒకే దృక్కోణంలో చూడరు. ఒక్కొక్కరు ఒక్కో దృష్టితో చూస్తారు. ఇక అదే వాళ్ల వ్యక్తిత్వాన్ని చెబుతుందని అంటుంటారు. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా అంతే.. ఇవి మన వ్యక్తిత్వ లక్షణాలను ప్రతిబింబిస్తాయి. సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్స్‌కు ప్రత్యేకంగా పలు పేజీలు కూడా ఉన్నాయి. మరి ఆ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది. అదేంటో చూసేద్దాం పదండి..
పైన పేర్కొన్న ఫోటోను క్షుణ్ణంగా పరిశీలించండి.. మీకేం కనిపిస్తోంది. చాలామంది అయితే ఠక్కున మొసలి అని చెప్పేస్తారు. అయితే మొసలితో పాటు దాని చుట్టూ సముద్రం అంతేకాకుండా ఓ ద్వీపాన్ని మీరు చూడవచ్చు. మరి వాటిల్లో మీరు మొదటిగా ఏం చూశారు.! అదే మీ వ్యక్తిత్వాన్ని చెబుతుంది.