ఈ రోజుల్లో రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల భద్రతకు సంబంధించి రైల్వే సిబ్బంది, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. కానీ ఇప్పటికీ నేరస్థులు చాలా తెలివిగా నేరాలకు పాల్పడుతున్నారు. అలాంటి కేసుల్లో రైల్వే సిబ్బందికి కూడా ఎటువంటి ఆధారాలు లభించటం లేదు. రైల్వే స్టేషన్, రైలు లోపల నేరాలను నిరోధించడంలో రైల్వే శాఖ విజయం సాధించింది. కానీ, ఇప్పుడు నేరస్థులు మరింత తెలివిగా నేరాలకు పాల్పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
సాధారణంగా అందరూ ప్రయాణికులకు రైలు ఎక్కగానే విండో సీటు కోసం చూస్తారు.. అలాంటి సీటు దొరికితే హాయిగా కూర్చుని ఫోన్‌లో పాటలు వినటం లేదా సినిమాలు, వాట్సాప్ చాటింగ్‌లో మునిగిపోతుంటారు. కొందరు ట్రైన్ ఎక్కగానే ముందుగా ఫోన్ ఛార్జింగ్ కూడా పెడుతుంటారు. ఈ వీడియోలో కనిపిస్తున్న ప్రయాణికుడు కూడా అదే పని చేశాడు. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని కూర్చున్నాడు. అంతలోనే రైలు బయట స్టేషన్‌లో ఉన్న ఓ దొంగ తన చేతివాటం ప్రదర్శించాడు. రైలు ప్లాట్‌ఫామ్ నుంచి స్టార్ట్ అవగానే కిటికీలోంచి చేయి వేసి ప్రయాణికుడి ఫోన్ దొంగిలించి పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో ఆ వ్యక్తి వెంటనే బయటకు రాలేకపోయాడు. ఎందుకంటే, అప్పటికే రైలు కదిలిపోయింది. పైగా రైల్లో పెద్ద సంఖ్యలో ఉన్న ఇతర ప్రయాణికులు రైలు తలుపు వద్ద కూడా కిక్కిరిసి ఉన్నారు.
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో _fear_of_life_ అనే ఖాతాతో షేర్ చేయబడింది. 73.7 మిలియన్ల మంది చూశారు. కాగా ఈ వీడియోను 17 లక్షల మంది లైక్ చేశారు. సోషల్ మీడియా యూజర్లు పోస్ట్‌పై కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వీడియో ఎప్పుడు, ఎక్కడిది అనే సమాచారం వెల్లడి కాలేదు. అయితే, పోస్ట్ క్యాప్షన్‌లోని హ్యాష్‌ట్యాగ్‌లో, వీడియో సత్నా రైల్వే స్టేషన్‌కు చెందినదని తెలిసింది. వీడియో చూసిన నెటిజన్లు పెద్ద సంఖ్యలో స్పందించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…