Viral video : ఆశగా ప్రపోజ్ చేశాడు.. కానీ అమ్మాయి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..

|

Mar 15, 2023 | 8:13 PM

అదేదో సినిమాలో చెప్పినట్టు.. అమ్మాయి కి ఐ లవ్ యూ చెప్పడం పెద్ద కష్టమేమి కాదు.. కానీ ఆ అమ్మాయి నో అంటే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం.

Viral video : ఆశగా ప్రపోజ్ చేశాడు.. కానీ అమ్మాయి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది..
Love
Follow us on

ప్రేమ ఎప్పుడు ఎవరిలో పుడుతుందో చెప్పడం ఎవరివల్లా కాదు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. కొంతమంది 10 ఏళ్ళవయసులో ప్రేమలో పడితే మరోకొంతమంది 60ఏళ్ల వయసులో కూడా ప్రేమలో పడుతూ ఉంటారు. అయితే ప్రేమను వ్యక్త పరచడం చాలా కష్టం.. అదేదో సినిమాలో చెప్పినట్టు.. అమ్మాయి కి ఐ లవ్ యూ చెప్పడం పెద్ద కష్టమేమి కాదు.. కానీ ఆ అమ్మాయి నో అంటే మాత్రం తట్టుకోవడం చాలా కష్టం. సరిగ్గా అదే జరిగింది ఈ బుడతడికి. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది

తాజాగా వైరల్ అవుతోన్న వీడియోలో ఓ చిన్నోడు స్కూల్ లో అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకోసం మనోడు ఒక పువ్వు పట్టుకొని స్కూల్ లో అందరి ముందు ఆ అమ్మాయి ఎదుట మోకాళ్ళ పై కూర్చొని తన ప్రేమను వ్యక్తపరచాలని అనుకున్నాడు.

ఇంతలో అది గమనించిన ఆ అమ్మాయి లాగి పెట్టి కొట్టింది. దాంతో ఆ బుడ్డోడి గుండె బద్దలైంది. ప్రేమను చెప్పే లోగానే ఆ అమ్మాయి మనోడి చెంప చెళ్లుమనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని పై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.