Viral News: బుడ్డోడి యూట్యూబ్‌ ఛానల్‌కు 100 మంది సబ్‌స్క్రైబర్లు.. ఊహించని అవార్డు ఇచ్చిన అతని ఫ్రెండ్‌..

|

Aug 16, 2022 | 9:46 AM

Viral News: సోషల్‌ మీడియా వాడకం పెరగడంతో కొత్త కొత్త ట్యాలెంట్‌కు బయటకు వస్తోంది. ప్రతిభను ప్రదర్శించుకునేందుకు యూట్యూబ్‌ను చక్కటి వేదికగా మలుచుకుంటున్నారు. సాధారణంగా కనిపించే విషయాలు...

Viral News: బుడ్డోడి యూట్యూబ్‌ ఛానల్‌కు 100 మంది సబ్‌స్క్రైబర్లు.. ఊహించని అవార్డు ఇచ్చిన అతని ఫ్రెండ్‌..
Representative Image
Follow us on

Viral News: సోషల్‌ మీడియా వాడకం పెరగడంతో కొత్త కొత్త ట్యాలెంట్‌కు బయటకు వస్తోంది. ప్రతిభను ప్రదర్శించుకునేందుకు యూట్యూబ్‌ను చక్కటి వేదికగా మలుచుకుంటున్నారు. సాధారణంగా కనిపించే విషయాలు సైతం సోషల్‌ మీడియాలోకి ఎక్కేసరికి విభిన్నంగా మారిపోతున్నాయి. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఓ ట్వీట్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఓ తండ్రి తన కుమారుడికి వచ్చిన గిఫ్ట్‌ను ట్వీట్‌ చేయగా ఇప్పుడా ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

ఇంతకీ విషయమేంటంటే.. ఓ కుర్రాడు యూట్యూబ్‌ ఛానల్‌ను రన్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా అతని ఛానల్‌కు సబ్‌స్క్రైబర్ల సంఖ్య 100 దాటేసింది. దీంతో ఆ బుడ్డోడి స్నేహితుడు అతని కోసం ఓ వెరైటీ గిఫ్ట్‌ను అందించాడు. సాధారణంగా సబ్‌స్క్రైబర్ల సంఖ్య లక్షల్లో చేరితే యూట్యూబ్‌ నుంచి సిల్వర్‌, గోల్డ్‌ బటన్‌ను అందిస్తుంటుంది. ఆ కుర్రాడు కూడా తన ఫ్రెండ్‌కు అలాంటి బహుమతినే ఇవ్వాలనుకున్నాడు. వెంటనే ఓ పాత చెక్కను తీసుకున్నాడు. దానిపై పెన్నుతో యూట్యూబ్‌ లోగోను గీసి, 100 మంది సబ్‌స్క్రైబర్లు చేరుకుందుకు గాను బహుకరిస్తున్నాం అంటూ రాసుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

దీంతో ఆ చెక్కను ఫొటోగా తీసిన సదరు కుర్రాడి తండ్రి ట్వీట్‌ చేశాడు. ‘నా కుమారుడు 100 సబ్‌స్క్రైబర్లకు చేరుకున్నాడు. దీంతో అతని ఫ్రెండ్ ఈ ప్లే బటన్‌ను బహుకరించాడు’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. చెక్క ప్లే బటన్‌ను రూపొందించిన కుర్రాడి ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..