కారు స్టీరింగ్‌ పట్టుకుని… సైకిల్‌ తొక్కుతున్న బుడ్డొడి స్టైల్‌ అదుర్స్‌… వీడియో చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే!

|

Feb 26, 2024 | 3:45 PM

ఇది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అతను ఇలా ఎలా చేసాడు అనుకుంటూ అనుమానం వ్యక్తం చేశారు. కానీ, విద్యార్థి మాత్రం ఆనందంగా సైకిల్ తొక్కుతూ నవ్వుతూ, సరదాగా స్కూల్‌కి వెళ్తున్నాడు. అతడిని చూస్తుంటే హ్యాండిల్‌కి బదులు కార్ స్టీరింగ్‌తో రైడింగ్‌ చేస్తూ మరింత ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది..

కారు స్టీరింగ్‌ పట్టుకుని... సైకిల్‌ తొక్కుతున్న బుడ్డొడి స్టైల్‌ అదుర్స్‌... వీడియో చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే!
Jugaad Cycle
Follow us on

Jugaad Cycle Viral Video : మీలో చాలా మంది చిన్నతనంలో స్కూల్‌కి వెళ్లేందుకు సైకిల్‌ను వాడే ఉంటారు. నేటికీ చాలా మంది సైకిల్‌నే వాడుతున్నారు. కానీ, ఇన్నేళ్లయినా సైకిల్‌ ప్రాథమిక నిర్మాణంలో మాత్రం మార్పు కనిపించడం లేదు. కానీ, ఒక పాఠశాల విద్యార్థి సైకిల్ హ్యాండిల్‌బార్‌లను మార్చేశాడు..దాన్ని ఏకంగా కారు స్టీరింగ్ వీల్‌గా తయారు చేశాడు. స్టీరింగ్‌ సైకిల్ పైనే అతడు ఇప్పుడు ప్రతిరోజు స్కూల్‌కి వెళ్తున్నాడు. బాలుడు చేసిన జుగాఢ్‌ సైకిల్‌ చేంజ్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఇది చూసిన చాలా మంది ఇది ఎలా సాధ్యమం ఆశ్చర్యపోతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక స్కూల్‌ విద్యార్థిని యూనిఫామ్‌లో సైకిల్‌ పై వెళ్తు్ండగా ముందుగా మనం చూస్తాం.. అయితే, ఆ స్కూల్‌ స్టూడెంట్ ప్రయాణిస్తున్న సైకిల్‌ మాత్రం చాలా భిన్నంగా ఉంది. అతడు తొక్కుతున్న సైకిల్‌కు రెండు హ్యాండిల్స్‌ లేవు.. దానికి బదులుగా కారు స్టీరింగ్‌ ఏర్పాటు చేసి ఉంది. విద్యార్థి ఈ అద్భుతమైన ప్రతిభ ఇప్పుడు చాలా మంది ప్రశంసలు అందుకుంది. ఆ విద్యార్థి తొక్కుతున్న సైకిల్‌ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఈ హ్యాండిల్ ఒక సాధనం కాదు, కారు స్టీరింగ్ వీల్.

ఇవి కూడా చదవండి

ఇది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. అతను ఇలా ఎలా చేసాడు అనుకుంటూ అనుమానం వ్యక్తం చేశారు. కానీ, విద్యార్థి మాత్రం ఆనందంగా సైకిల్ తొక్కుతూ నవ్వుతూ, సరదాగా స్కూల్‌కి వెళ్తున్నాడు. అతడిని చూస్తుంటే హ్యాండిల్‌కి బదులు కార్ స్టీరింగ్‌తో రైడింగ్‌ చేస్తూ మరింత ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది..

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @arvindkashyap7364 ద్వారా పంచుకున్నారు. చాలా మంది దీనిపై ఫన్నీగా స్పందించారు. మరికొందరు విద్యార్థికి సైకిల్‌ను జాగ్రత్తగా నడపమని సలహా ఇచ్చారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..