మన జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర మరవలేనిది. జీవితంలో ఎవరైనా గొప్ప స్థానంలో ఉన్నారంటే దాని వెనకాల ఉపాధ్యాయుల కృషి చాలా ఉంటుంది. వారు మనకోసం చేసే కృషికి రుణం తీర్చుకోవడం అంత సులభం కాదు. అలాంటి తన టీచర్లకు ఓ పాటను అంకింతం ఇచ్చాడు ఓ యువకుడు. షారూక్ ఖాన్ ‘రబ్ నే బనాదీ జోడీ’లోని ‘తుజ్ మైన్ రబ్ దిఖ్తా హై ’ అనే పాటకు ఆ యువకుడు స్టెప్లు వేశాడు. మధ్యమధ్యలో టీచర్లను కలుపుకుంటూ ఆ అబ్బాయి వేసిన డ్యాన్స్ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇక దీనిపై షారూక్ ఖాన్ కూడా స్పందిస్తూ.. నా పాటలకు వీరు వేసే డ్యాన్స్ నన్ను చాలా ఆనందపరుస్తాయి అంటూ కామెంట్ పెట్టాడు. ఈ వీడియోకు సంబంధించిన వివరాలు తెలియకపోయినప్పటికీ.. ప్రస్తుతం వైరల్గా మారిన ఆ వీడియోనూ మీరూ చూసేయండి.
All these young boys & girls dancing to my songs make me look better! How sweet is this. https://t.co/7lqHCXWG2A
— Shah Rukh Khan (@iamsrk) March 9, 2019