Viral Video: సమయానికి దేవుడిలా వచ్చాడు.. కాపాడాడు.. లేదంటే నిండు ప్రాణాలు…

|

Nov 18, 2021 | 8:46 AM

సోషల్ మీడియా నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి.. ఫేస్‌బుక్, ఇన్ స్టా లేదా ట్విట్టర్ ఓపెనా చేశామా.. టైమ్ ఎలా గడిచిపోతుందో  కూడా తెలీదు.

Viral Video: సమయానికి దేవుడిలా వచ్చాడు.. కాపాడాడు.. లేదంటే నిండు ప్రాణాలు...
Man Saves Boy Life
Follow us on

సోషల్ మీడియా నిత్యం అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేసి.. ఫేస్‌బుక్, ఇన్ స్టా లేదా ట్విట్టర్ ఓపెనా చేశామా.. టైమ్ ఎలా గడిచిపోతుందో  కూడా తెలీదు. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట తెగ సర్కులేట్ అవుతుంది. ఒక వ్యక్తి వెంటనే స్పందిచడం వలన నిండు ప్రాణాలు నిలిచాయి. ఒక రెస్టారెంట్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.  గగుర్పాటు కలిగించే వీడియో యూట్యూబ్ ఛానెల్ వైరల్ హాగ్‌లో పోస్ట్ చేశారు. వివరాల ప్రకారం, ఈ సంఘటన అమెరికాలోని విస్కాన్సిన్‌లో ఆగస్టులో జరిగింది.

వైరల్ అవుతున్న వీడియోలో, జోసెఫ్ రీన్‌హార్ట్ అనే వ్యక్తి స్థానిక రెస్టారెంట్‌లో ఒక టీనేజర్ ప్రాణాలను కాపాడాడు.క్లిప్‌లో ఓ అబ్బాయి రెస్టారెంట్‌లో చికెన్ శాండ్‌విచ్ తింటుండగా.. చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో అతడు ఊపిరాడక అల్లాడిపోయాడు. అక్కడే ఉన్న, జోసెఫ్ రీన్‌హార్ట్ అనే వ్యక్తి వెంటనే స్పందించాడు. యువకుడి ప్రాణాలను కాపాడేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశాడు. చివరికి సఫలీకృతం అయ్యాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ వైరల్ అవుతోంది.

‘జోసెఫ్ రీన్‌హార్ట్ అనే వ్యక్తి స్థానిక బార్ అండ్ రెస్టారెంట్‌లో ఒక టీనేజర్ ప్రాణాన్ని కాపాడాడు. ఓ అబ్బాయి చికెన్ శాండ్‌విచ్ ఫాస్ట్‌గా తినబోయాడు. ఈ క్రమంలో చికెన్ ముక్క అతని గొంతులో స్ట్రక్ అయ్యింది. వీడియోలో గాబారాగా కనిపిస్తున్న మహిళ ఆ యువకుడి తల్లి. వీడియోలో ఉన్న మరో మహిళ ఎమర్జెన్సీకి కాల్ చేసింది. అదృష్టవశాత్తూ ఆ అబ్బాయి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు’ అని వీడియోను షేర్ చేస్తూ, పేజీ అడ్మిన్ క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు.

వెంటనే స్పందించి.. ఓ నిండు ప్రాణాన్ని కాపాడిన  జోసెఫ్ రీన్‌హార్ట్‌ని నెటిజన్లు హీరో అని కీర్తిస్తున్నారు. వీడియోను లైక్ చేస్తూ.. షేర్లు చేస్తూ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

Also Read: ఎవరో గుర్తించారా..? వెండితెరపై అలా మెరిసి… ఇలా మాయమైంది

 ‘జవాద్‌’ ఎఫెక్ట్‌.. ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక