Watch: భర్తపై దాడిచేసిన లేడీ బాక్సర్‌.. సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు చూస్తే..

విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్‌లో తన కుటుంబంతో కలిసి కూర్చున్న సావీటీ , తన భర్త దీపక్ మాటలకు కోపంతో ఊగిపోయింది. హఠాత్తుగా లేచి అతన్ని కొట్టడం ప్రారంభించింది. తన తల్లిదండ్రులతో కూర్చున్న సావీటీ, తనకు ఎదురుగా కూర్చున్న భర్త దీపక్ తో వాగ్వాదానికి దిగింది. ఈ సమయంలో సహనం కోల్పోయిన ఆమె అకస్మాత్తుగా దీపక్ చొక్కా పట్టుకుని కొట్టింది. ఈ దృశ్యం సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Watch: భర్తపై దాడిచేసిన లేడీ బాక్సర్‌.. సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు చూస్తే..
Saweety Boora

Updated on: Mar 26, 2025 | 4:58 PM

2023 ప్రపంచ ఛాంపియన్‌షిప్ బంగారు పతక విజేత బాక్సర్ సావీటీ బూరా ఆమె భర్త, భారత కబడ్డీ మాజీ కెప్టెన్ దీపక్ హుడా గొడవ పడుతున్న వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ సీసీటీవీ ఫుటేజ్‌ వీడియోలో సావీటీ బూరా తన భర్తపైకి దూసుకెళ్లి, అతని కాలర్ పట్టుకుని దాడి చేస్తుండటం కనిపించింది. దాంతో అక్కడున్న వారంతా ఆమెను అడ్డుకుని దూరంగా లాగేశారు.

వరకట్న వేధింపుల ఆరోపణలు చేస్తూ దీపక్ హుడా, అతని కుటుంబ సభ్యులపై సావీటీ బూరా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ క్రమంలోనే ఈ జంట విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంలో ఇద్దరి కుటుంబ సభ్యులు విచారణ కోసం పోలీస్ స్టేషన్‌లో కూర్చుని ఉండగా, సవీతి అకస్మాత్తుగా తన భర్త దీపక్ హుడాపై దాడికి దిగింది. మార్చి 15న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఒక కారు, కోట్ల రూపాయలు కట్నంగా ఇచ్చినప్పటికీ దీపక్ ఇంకా తనను కట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు సావీటీ  ఫ్యామిలీ.. కట్నం విషయంలో తనపై దాడి జరిగిందని కూడా సావీటీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీపక్ హుడా ఖరీదైన ఫార్చ్యూనర్ కారుతో పాటు అదనపు కట్నం డిమాండ్ చేస్తూ తనను వేధిస్తున్నాడని సావీటీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు దీపక్, అతని కుటుంబ సభ్యులపై హర్యానాలోని హిస్సార్ మహిళా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వీడియో ఇక్కడ చూడండి..

విచారణలో భాగంగా పోలీస్ స్టేషన్‌లో తన కుటుంబంతో కలిసి కూర్చున్న సావీటీ , తన భర్త దీపక్ మాటలకు కోపంతో ఊగిపోయింది. హఠాత్తుగా లేచి అతన్ని కొట్టడం ప్రారంభించింది. తన తల్లిదండ్రులతో కూర్చున్న సావీటీ, తనకు ఎదురుగా కూర్చున్న భర్త దీపక్ తో వాగ్వాదానికి దిగింది. ఈ సమయంలో సహనం కోల్పోయిన ఆమె అకస్మాత్తుగా దీపక్ చొక్కా పట్టుకుని కొట్టింది. ఈ దృశ్యం సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..