ఈ బుడ్డది సామాన్యురాలు కాదండోయ్.. తన సంపాదనతో ఏకంగా ఇంటినే కొనేసింది

| Edited By:

Jul 27, 2019 | 6:24 AM

ఈ మధ్యకాలంలో యువత తమలోని టాలెంట్‌ను బయటపెట్టడానికి యూట్యూబ్‌ ఛానల్ పెడుతున్నారు. కంటెంట్ ఉంటే చాలు.. యూట్యూబ్ ద్వారా వాళ్ళు చాలామందికి చేరువై.. ప్రశంసలు పొందుతున్నారు. కొంతమంది అయితే తమకు నచ్చని ఉద్యోగాన్ని కూడా వదిలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా సౌత్ కొరియాకు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి బోరమ్.. యూట్యూబ్ ఛానల్ పెట్టగా.. ఆ ఛానల్‌కు 30 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. ఇక అలా వచ్చిన డబ్బుతో.. ఏకంగా ఐదంతస్తుల […]

ఈ బుడ్డది సామాన్యురాలు కాదండోయ్.. తన సంపాదనతో ఏకంగా ఇంటినే కొనేసింది
Follow us on

ఈ మధ్యకాలంలో యువత తమలోని టాలెంట్‌ను బయటపెట్టడానికి యూట్యూబ్‌ ఛానల్ పెడుతున్నారు. కంటెంట్ ఉంటే చాలు.. యూట్యూబ్ ద్వారా వాళ్ళు చాలామందికి చేరువై.. ప్రశంసలు పొందుతున్నారు. కొంతమంది అయితే తమకు నచ్చని ఉద్యోగాన్ని కూడా వదిలిసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం జరుగుతోంది. ఇది ఇలా ఉండగా సౌత్ కొరియాకు చెందిన ఓ ఆరేళ్ళ చిన్నారి బోరమ్.. యూట్యూబ్ ఛానల్ పెట్టగా.. ఆ ఛానల్‌కు 30 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ వచ్చారు. ఇక అలా వచ్చిన డబ్బుతో.. ఏకంగా ఐదంతస్తుల భవంతినే కొనేసింది ఈ బుడ్డది.

ఆరేళ్ళ బోరమ్.. యూట్యూబ్‌లో రెండు ఛానల్స్‌ను నడుపుతోంది. వాటిల్లో ఓ ఛానల్‌లో ఆమె బొమ్మల మీద రివ్యూస్ ఇస్తుండగా.. దానికి 13.6 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇక మరో ఛానల్‌ను ఆమె వీడియో బ్లాగ్‌గా నడుపుతుండగా.. దానికి 17.6 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇలా ఈ రెండు ఛానల్స్ మీద వస్తున్న డబ్బుల ద్వారా సియోల్ సబర్బ్‌లో 8 మిలియన్ డాలర్లు పలికే ప్రాపర్టీని బోరమ్ ఫ్యామిలీ కంపెనీ పేరు మీద కొనేసింది.

ఇకపోతే ఆమె చేసిన వీడియోలలో ఒకటైన.. ఇన్‌స్టాంట్ న్యూడిల్స్ వీడియోకు.. దాదాపు 376 మిలియన్ వ్యూస్ రావడం విశేషం. అంతేకాకుండా కొన్ని వీడియోస్‌కు కాంట్రవర్సీలకు ప్రతీక కాగా.. అది కూడా ఛానల్‌కు సబ్‌స్క్రైబర్స్ పెరగడంలో ఉపయోగపడింది.