ఎంత స్నేక్ క్యాచర్ అయినప్పటికీ.. పాములు పట్టే సమయంలో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే.. పెను ప్రమాదాలు సంబంవించే అవకాశం ఉంటుంది. కింగ్ కోబ్రా, రక్త పింజర వంటి పాములు చాలా అగ్రెసీవ్‌గా ఉంటాయి. వాటిని బంధించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తాజాగా ఓ స్నేక్ క్యాచర్ ప్రాణాలను పణంగా పెట్టి భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్న వీడియో సోషల్ మీడియా యూజర్స్‌ను షాక్‌కు గురి చేస్తుంది. కమాండర్ అశోక్ బిజల్వాన్ ట్విట్టర్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. రోమాలు నిక్కబొడుచుకునే థ్రిల్లర్ అని పేర్కొన్నారు. గోవాలో ఈ ఘటన వెలుగుచూసింది.
పొలంలో ఈ భారీ పామును గుర్తించిన స్థానికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే లోకల్ స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించారు. అతడు వచ్చి దాన్ని బంధించేందుకు ఆపసోపాలు పడ్డాడు. తొలుత పొదల్లోకి జారుకుంటున్న ఆ పామును అతడు తోక పట్టి పొలంలోకి లాగగా.. మెరుపు వేగంతో పడగవిప్పి అతడిపై దాడి చేసేందుకు దూసుకువచ్చింది. అలిమి కాకపోవడంతో.. ఒకసారి దాన్ని విడిచిపెట్టాడు. రెండోసారి పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా.. మనిషి ఎత్తు లేచింది. దీంతో ఆ స్నేక్ క్యాచర్ మళ్లీ దాన్ని విడిచిపెట్టాడు. మూడు, నాలుగు, ఐదు ప్రయత్నాల్లో కూడా విఫలమయ్యాడు. ఆరవ ప్రయత్నంలో జాగ్రత్తగా ఓ సంచిలో బంధించాడు.
ఆన్‌లైన్‌లో ఈ వీడియోకు భారీగా లైక్స్, షేర్స్ వస్తున్నాయి. ఇంత పెద్ద పామును తానెప్పుడు చూడలేదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలాంటి పాము కాటేస్తే మరణమే అని మరొకరు పేర్కొన్నారు. వీడియోను దిగువన చూడండి.
Huge King Cobra being captured in Goa.
What a hair raising thriller… pic.twitter.com/8QpIXyYpmG— Commander Ashok Bijalwan ?? (@AshTheWiz) April 27, 2023
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..