ప్రయాణికులతో వెళ్తున్న విమానానికి పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. అమెరికాలో ఓ కార్గో విమానానికి ఆకాశంలో మంటలంటుకొన్నాయి. మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానం గాలిలో ఉండగా మంటలు చెలరేగాయి. మియామీ ఎయిర్‌పోర్టు నుంచి అట్లాస్ ఎయిర్ కంపెనీకి చెందిన బోయింగ్ 747-8 కార్గో విమానం గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎడమవైపు ఉన్న ఇంజిన్‌కు మంటలంటుకున్నాయి.. దీంతో అదే ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
మియామీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి అట్లాస్ ఎయిర్ కంపెనీకి చెందిన బోయింగ్ 747-8 కార్గో విమానం గురువారం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. దీంతో అదే ఎయిర్‌పోర్టులో విమానాన్ని అత్యవసరంగా దించేశారు. విమానం సిబ్బంది అన్ని ప్రామాణిక విధానాలను అనుసరించి మియామీ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యారని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. అయితే, విమానంలో ఎంత మంది సిబ్బంది ఉన్నారు.?అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదని అధికారులు తెలిపారు.
💥#BREAKING: Atlas Air Boeing 747-8 catches fire with sparks shooting out during mid flight.#Miami | #Florida #boeing7478 #atlasair pic.twitter.com/3IO5xFvMr6
— Noorie (@Im_Noorie) January 19, 2024
కాగా, విమానానికి మంటలు అంటుకున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆకాశం మధ్యలో ఒక విమానం మంటలంటుకుని ఉండటం చూడవచ్చు. అటువంటి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వీడియోలు ఇంకా ధృవీకరించబడలేదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి