వామ్మో.. రైల్వే ట్రాక్ మీద నిలిచిన బస్సు.. వేగంగా దూసుకొచ్చిన వందేభారత్..!

రైల్వే క్రాసింగ్ వద్ద పది మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సు రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన బెంగళూరులో రైల్వే క్రాసింగ్ భద్రతపై విస్తృత ఆందోళనను రేకెత్తించింది. పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

వామ్మో.. రైల్వే ట్రాక్ మీద నిలిచిన బస్సు.. వేగంగా దూసుకొచ్చిన వందేభారత్..!
Vande Bharat

Updated on: Apr 03, 2025 | 1:34 PM

కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో బుధవారం రైల్వే ట్రాక్‌పై ఓ బస్సు ఆగిపోయింది. ఆ సమయంలో అదే రైల్వేట్రాక్‌ పై నుంచి వందేభారత్ రైలు వస్తుంది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. మైసూర్-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సమీపిస్తున్న సమయంలో కెంగేరి సమీపంలోని రామోహళ్లి రైల్వే క్రాసింగ్ వద్ద పది మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) బస్సు రైల్వే ట్రాక్‌పై చిక్కుకుపోయింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన బెంగళూరులో రైల్వే క్రాసింగ్ భద్రతపై విస్తృత ఆందోళనను రేకెత్తించింది. పరిస్థితికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

ఎయిర్‌లాక్ సమస్య కారణంగా బస్సు పట్టాలపై చిక్కుకుపోయినట్టుగా అధికారులు వెల్లడించారు.. సమస్య తలెత్తిన వెంటనే, డ్రైవర్ వెంటనే BMTC, రైల్వే అధికారులను అప్రమత్తం చేశాడు. ఉదయం 7:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అధికారులు వేగంగా స్పందించారు. 20 నిమిషాల్లోనే వాహనాన్ని తొలగించారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

అయితే వెంటనే అప్రమత్తమైన రైల్వేగార్డ్ వందేభారత్ రైలుకు రెడ్ సిగ్నల్ ఇచ్చాడు. దీంతో రైలు ఆగిపోయి, భారీ ప్రమాదం తప్పింది. రాష్ట్రప్రభుత్వం కాలం చెల్లిన బస్సులను నడపొద్దని ఈ వీడియో చూసిన నెటిజన్లు విమర్శిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..