Viral Video: వామ్మో.. బీచ్‌లోకి కొట్టుకొచ్చిన వింత జీవులు.. ముట్టుకుంటే మటాషే! ఇంతకు ఏంటివి?

చెన్నై కాసిమేడు బీచ్‌కు కొట్టుకొచ్చిన బ్లూ డ్రాగన్ (గ్లాకస్ అట్లాంటికస్) సముద్ర జీవులు పర్యాటకులను భయపెడుతున్నాయి. ఇవి అత్యంత విషపూరితమైనవని, వీటిని తాకడం వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, అలర్జీ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరించారు. జెల్లీ ఫిష్‌లను తినే ఈ జీవులను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దని, తీరంలో కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Viral Video: వామ్మో.. బీచ్‌లోకి కొట్టుకొచ్చిన వింత జీవులు.. ముట్టుకుంటే మటాషే! ఇంతకు ఏంటివి?
Blue Dragon Fish Spotted Chennai Beach (1)

Updated on: Jan 02, 2026 | 7:48 PM

సముద్రంలో రకరకా జీవరాశులు నివసిస్తుంటాయి. వాటిలో కొన్ని మానవులకు ఆహారంగా ఉపయోగపడితో మరికొన్ని.. ప్రాణాతంకంగా ఉంటాయి. అయితే కొన్ని సార్లు సముద్రంలో భారీ అలలు కారణంగా అవి సముద్రతీరానికి కొట్టుకొని వస్తాయి. తాజాగా చెన్నైలోని కాసిమేడు బీచ్‌లోకి కూడా కొన్ని జీవులు కొట్టుకు వచ్చాయి. అవి చూడ్డానికి బ్లూ కలర్‌లో విచిత్రంగా కనిపించడంతో పర్యాటకులు కంగారు పడిపోయి అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో బీచ్‌కు చేరుకున్న అధికారులు వాటిని పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఈ సముద్ర జీవులను బ్లా డ్రాగన్‌ అంటారని.. ఇవి చాలా ప్రమాదకరమైనవని తెలిపారు. ఈ బ్లూ డ్రాగన్ కాటు వల్ల నొప్పి, వాపు, వికారం, అలెర్జీలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఒడ్డుకు కొట్టుకు వచ్చిన బ్లూ డ్రాగన్ చేపను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. అయితే ఈ బ్లా డ్రాగన్స్‌ ఇలా ఒడ్డుకు కొట్టుకు రావడం ఇదే తొలిసారేం కాదట గత సంవత్సరం స్పెయిన్‌లోనే ఇలానే బ్లూ డ్రాగన్ చేపలు ఒడ్డుకు కొట్టు వస్తే.. అప్పుడు ఏకంగా ఆ బీచ్‌ను క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

శాస్త్రీయంగా గ్లాకస్ అట్లాంటికస్ అని పిలువబడే బ్లూ డ్రాగన్ ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉన్నప్పటికీ అత్యంత విషపూరితమైనదని నిపుణులు హెచ్చరించారు. ఈ జీవిని కుట్టడం లేదా నేరుగా తాకడం వల్ల తీవ్రమైన నొప్పి, వాపు, వికారం, అలెర్జీ వంటి సమస్యలు సంభవించవచ్చంటున్నారు. ఈ బ్లూ డ్రాగన్ చేపలు విషపూరిత జెల్లీ ఫిష్‌లను తిని జీవిస్తాయని.. ప్రజలెవరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ జీవిని తాకవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీరప్రాంతంలో అటువంటి అరుదైన సముద్ర జీవులు కనిపిస్తే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వెంటనే అధికారులను అప్రమత్తం చేయాలని కోరారు.

వీడియో చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.