బాబోయ్‌… ఇవేం చీమలు రా సామీ..! నీలిరంగులో జిగేల్‌ మంటున్న అరుదైన జాతి గుర్తింపు..!

|

Jun 05, 2024 | 2:01 PM

ఈ భూమ్మీద ఉన్న మొత్తం 16,724 చీమజాతుల్లో ఈ నీలి రంగు చీమలు అత్యంత అరుదైనవిగా వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన చీమల తల త్రిభుజాకారంగా, కళ్లు పెద్దగా, నోరు త్రిభుజాకారంగా, ఐదు దంతాలు కలిగి ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

బాబోయ్‌... ఇవేం చీమలు రా సామీ..! నీలిరంగులో జిగేల్‌ మంటున్న అరుదైన జాతి గుర్తింపు..!
Blue Ants
Follow us on

మనందరికీ తెలిసి చీమలు నలుపు లేదా ఎరుపు రంగుల్లో ఉంటాయి. కానీ మీరేప్పుడైన నీలం రంగు చీమలు చూశారా..? అవును.. అరుణాచల్‌ప్రదేశ్‌లో అరుదైన నీలి రంగు చీమలు హల్‌చల్‌ చేస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ లోయలో నీలం రంగులో ఉండే చీమల జాతిని గుర్తించారు పరిశోధకులు. బెంగుళూరుకు చెందిన అశోకా జీవావరణ, పర్యావరణ పరిశోధనా సంస్థ (అట్రీ), ఫెరిస్‌ క్రియేషన్స్‌లకు చెందిన సంయుక్త పరిశోధనా బృందం ఈ అరుదైన రకం చీమల జాతిని కనిపెట్టారు.

అపూర్వమైన జీవవైవిధ్యానికి నెలవైన సియాంగ్‌ లోయలో స్థానిక తెగలను అణచివేయడానికి 1912-1922లో బ్రిటిష్‌ వలస ప్రభుత్వం దండయాత్ర చేపట్టింది. ఆ దండు వెంట వెళ్లిన పరిశోధకులు సియాంగ్‌ లోయలోని ప్రతి మొక్క, బల్లి, కప్ప, చేప, పక్షి, పురుగు, క్షీరదం వివరాలను భారతీయ మ్యూజియం రికార్డుల కోసం నమోదు చేశారు.

వందేళ్ల తరవాత ఇప్పుడు బెంగుళూరు పరిశోధకుల బృందం మళ్లీ సియాంగ్‌ లోయకు వెళ్లి సర్వే చేసింది. అక్కడి మారుమూల యింకు గ్రామంలోని మారుమూల ప్రాంతంలోని చెట్టుపై 10 అడుగుల ఎత్తులో ఉన్న రంధ్రంలో చూడగా, పరిశోధకులు చీకటిలో ఏదో మెరుస్తున్నట్లు గుర్తించారు. ఇవి ప్రకాశవంతమైన చీమలు అని తెలుసుకుని వారు ఆశ్చర్యపోయారు. ఈ ఆవిష్కరణ జూకీస్ జర్నల్‌లో ప్రచురించబడింది. వాటికి ‘పారాపారాట్రెకినా నీల’ అని నామకరణం చేశారు పరిశోధకులు.

ఇవి కూడా చదవండి

ఈ భూమ్మీద ఉన్న మొత్తం 16,724 చీమజాతుల్లో ఈ నీలి రంగు చీమలు అత్యంత అరుదైనవిగా వెల్లడించారు. ఈ ప్రత్యేకమైన చీమల తల త్రిభుజాకారంగా, కళ్లు పెద్దగా, నోరు త్రిభుజాకారంగా, ఐదు దంతాలు కలిగి ఉంటుందని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..