Viral: చేతి స్పర్శను కోల్పోయి అస్పత్రికొచ్చిన వ్యక్తి.. డాక్టర్లు స్కాన్ చేయగా మైండ్ బ్లాంక్.!

|

Jan 27, 2024 | 1:04 PM

సాధారణంగా మన కంట్లో చిన్న నలుసు పడితేనే విలవిలలాడిపోతాం. అలాగే మనకు ఏదైనా చిన్న గాయమైనా కూడా దాని నొప్పిని భరించలేం. అలాంటిది ఓ బుల్లెట్ ఏకంగా తలలోకి దిగితే.. ఎట్లా ఉంటది..! ఇదేం పిచ్చి ప్రశ్న.. అలా జరిగితే అక్కడికక్కడ ప్రాణాలు పోవడం పక్కా..

Viral: చేతి స్పర్శను కోల్పోయి అస్పత్రికొచ్చిన వ్యక్తి.. డాక్టర్లు స్కాన్ చేయగా మైండ్ బ్లాంక్.!
Representative Image
Follow us on

సాధారణంగా మన కంట్లో చిన్న నలుసు పడితేనే విలవిలలాడిపోతాం. అలాగే మనకు ఏదైనా చిన్న గాయమైనా కూడా దాని నొప్పిని భరించలేం. అలాంటిది ఓ బుల్లెట్ ఏకంగా తలలోకి దిగితే.. ఎట్లా ఉంటది..! ఇదేం పిచ్చి ప్రశ్న.. అలా జరిగితే అక్కడికక్కడ ప్రాణాలు పోవడం పక్కా.. అదృష్టం ఉంటేనే తప్ప మనిషి బ్రతకడు. ఇక ఇప్పుడు అలాంటి యమజాతకుడి గురించే చెప్పబోతున్నాం. తలలో బుల్లెట్ దిగినా.. ఏకంగా నాలుగు రోజులు గడిపేశాడు. ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే.?

వివరాల్లోకి వెళ్తే.. బ్రెజిల్‌కు చెందిన 21 ఏళ్ల మాటియస్ ఫాసియో అనే యువకుడికి వింత అనుభవం ఎదురైంది. స్నేహితులతో కలిసి బీచ్‌లో సరదాగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న అతడికి.. ఒక్కసారిగా తలపై ఏదో పడినట్టు అనిపించింది. రక్తం వస్తుండటంతో.. స్నేహితులు ఆతడికి వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసి.. కట్టు కట్టారు. అందరూ కూడా మాటియస్‌పైకి ఎవరో రాయి విసిరి ఉండొచ్చునని అనుకున్నారు. ఆ తర్వాత నాలుగు రోజులు స్నేహితులతో ఫుల్‌గా పార్టీ ఎంజాయ్ చేశారు.

ఇలా నాలుగు రోజుల పాటు బుల్లెట్ తలలోనే ఉంది. ఎలాంటి సమస్యా కూడా తలెత్తలేదు. కానీ ఆ తర్వాత ఓ రోజు కారులో వెళ్తుండగా.. అతడి చేతి స్పర్శ కోల్పోయినట్టు అనిపించింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు సదరు బాధితుడి తలను ఎక్స్‌రే తీసి చూడగా.. బుల్లెట్ ఉన్నట్టు కనిపించింది. దీంతో దెబ్బకు షాక్ అయ్యారు. అనంతరం రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేసి.. అతికష్టం మీద ఆ బుల్లెట్‌ను బయటకు తీశారు. అది 9mm బుల్లెట్‌గా గుర్తించారు డాక్టర్లు. తమ సర్వీసు హిస్టరీలో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని.. ఆపరేషన్ అయిన తర్వాత వెంటనే పోలీసులకు సమాచారం అందించామన్నారు. కాగా, బుల్లెట్ స్వాధీనం చేసుకున్న డాక్టర్లు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.(Source)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..