Viral Video: ఫ్రెండ్‌ షిప్‌ అంటే ఇలా ఉండాలి.. ఒకరికి తోడు మరొకరు..!

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యం కలిగించగా మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.

Viral Video: ఫ్రెండ్‌ షిప్‌ అంటే ఇలా ఉండాలి.. ఒకరికి తోడు మరొకరు..!
Birds Share Food
Follow us

|

Updated on: May 21, 2022 | 6:27 PM

Viral Video: సోషల్‌మీడియాలో ప్రతిరోజు చాలా వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. కొన్ని ఆశ్చర్యం కలిగించగా మరికొన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. నెటిజన్లు ఇలాంటి వీడియోలని ఎక్కువగా చూస్తారు. ఇంటర్‌నెట్‌లో ముఖ్యంగా జంతువుల కంటెంట్‌కి ఆదరణ ఎక్కువగాఉంటుంది. జంతువులు, పక్షుల వీడియోలు తరచూ వైరల్ అవుతుంటాయి. తాజాగా కొన్ని పక్షులు, చేపలకి సంబంధించిన వీడియోనెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. ఈ వీడియో నెటిజన్లకి బాగా నచ్చింది. ఇంతకీ వీడియోలో ఏం జరిగి ఉంటుందో తెలుసుకుందాం.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో నీటిపైన పక్షుల గూడు ఉండటం మనం గమనించవచ్చు. అందులో కొన్ని పక్షులు నివసిస్తుంటాయి. అయితే వాటి యజమాని ఒక ప్లేటులో వాటికి ఆహారం అందిస్తాడు. అవి తింటుండగా నీటిలో చేపల గుంపు వాటి గూడు దగ్గరికి వస్తాయి. వాటిని చూసిన పక్షి ఒకటి చేపలకి ఆహారం అందిస్తూ ఉంటుంది. ఇది నెటిజన్లకి బాగా నచ్చింది. ఫ్రెండ్‌ షిప్‌ అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను IFS సుశాంత్ నందా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. దీనికి ‘షేరింగ్ ఈజ్ కేరింగ్’ అనే క్యాప్షన్‌ రాశాడు. ఈ వీడియోని ఇప్పటివరకు 57 వేల మందికి పైగా చూశారు. వీడియో చూసిన నెటిజన్లు వారి అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇలా అన్నాడు. ‘ఈ గుణం మనుషుల్లో వస్తే ఈ భూమి స్వర్గంగా మారుతుంది’ అని కామెంట్‌ చేశాడు. మరొక నెటిజన్‌ ‘మానవులు వారి నుంచి నేర్చుకోవాలి’ అని రాశాడు. ఇది కాకుండా, చాలా మంది నెటిజన్లు వారి అభిప్రాయాలని కామెంట్ల ద్వారా తెలియజేశారు. మీరు కూడా ఈ వీడియోని చూస్తే మీ కామెంట్‌ తెలపండి.

మరిన్ని వైరల్‌ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి