Cat – Bird Viral Video: ఇంటర్నెట్ ప్రపంచంలో నిత్యం ఎన్నో వీడియోలు వైరల్ అవుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వీడియోలను చూస్తే కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. మరికొన్నిసార్లు వింతగా అనిపిస్తుంది. జంతువులకు సంబంధించిన వీడియోలలో ఇది తరచుగా కనిపిస్తుంది. ఈ రోజుల్లో కూడా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఒక పిల్లి పావురాలను వేటాడాలనుకుంటుంది. కానీ ఇంతలోనే జరిగిన ఓ సన్నివేశంతో అది అక్కడి నుంచి పరుగులు తీస్తుంది. అయితే.. సరదా సన్నివేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు. పిల్లులు వేటాడటంలో ముందు వరుసలోనే ఉంటాయి. అవకాశం లభించిన వెంటనే.. అవి తమ ఎరను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. రెప్పపాటులో దాడి చేసి.. బాధిత జీవులను తప్పించుకునే అవకాశమే ఇయ్యవు.
తాజాగా.. పిల్లి వేటకు సంబంధించిన వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. వైరల్ అవుతున్న వీడియోలో.. సరస్సు ఒడ్డున ఉన్న రెయిలింగ్‌పై రెండు పక్షులు హాయిగా కూర్చొని ఉండటాన్ని మీరు చూడవచ్చు. పిల్లి తమపై దాడి చేస్తుందని పావురాలకు అస్సలు తెలియదు. పిల్లి మాత్రం అవకాశం కోసం ఆత్రుతతో ఎదురు చూస్తోంది. పిల్లి రెయిలింగ్ దగ్గరికి వచ్చి పక్షి పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. పావురం దానిపై రెట్ట వేసింది. అది నేరుగా పిల్లి మొహంపై పడింది. దీంతో అసలేం జరుగుతుందో అర్ధం కాక పిల్లి అక్కడి నుంచి పరుగులు తీస్తుంది.
వైరల్ వీడియో..
వైరల్‌హాగ్ అనే యూజర్ ఈ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీన్ని వేలాది మంది వీక్షించి పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. మనం కూడా వేరే విషయాల్లో తలదూర్చితే ఇలాగే జరుగుతుందంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
Also Read: