Viral Video: హృదయాలను కొల్లగొడుతున్న వీడియో.. బైకర్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు

|

Aug 08, 2022 | 3:33 PM

ప్రపంచంలో రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. ఎదుటివారు ఇబ్బందుల్లో ఉంటే చూడలేని వారు కొందరైతే.. వారికి వెన్నుపోటు పొడిచేందుకు రెడీగా ఉండే వారు మరికొందరు. కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చేసినప్పుడు వచ్చే సంతృప్తే వేరు...

Viral Video: హృదయాలను కొల్లగొడుతున్న వీడియో.. బైకర్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు
Biker Video Viral
Follow us on

ప్రపంచంలో రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. ఎదుటివారు ఇబ్బందుల్లో ఉంటే చూడలేని వారు కొందరైతే.. వారికి వెన్నుపోటు పొడిచేందుకు రెడీగా ఉండే వారు మరికొందరు. కష్టాల్లో ఉన్న వాళ్లకు సహాయం చేసినప్పుడు వచ్చే సంతృప్తే వేరు. మనకు తోచినతం హెల్ప్ చేయడం ద్వారా వారిలో కొంతైనా సంతోషాన్ని నింపినవాళ్లవుతాం. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో, బైకర్ ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అతనికి దారి మధ్యలో రిక్షా నడుపుతున్న వ్యక్తి కనిపిస్తాడు. అతను పై వంతెన ఎక్కేందుకు కష్టపడుతుండటాన్ని బైకర్ చూస్తాడు. బైక్ ఆపి, హ్యాండ్‌కార్ట్‌ను తన పాదాలతో నెడతాడు. దీంతో అతను సులభంగా వంతెన పైకి చేరుకుంటాడు. అంతే కాకుండా రిక్షా వ్యక్తికి ఎనర్జీ డ్రింక్ కూడా ఇస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రజల హృదయాలను కొల్లగొడుతోన్న ఈ క్లిప్ ను చాలా మంది మెచ్చుకుంటున్నారు.

హృదయాన్ని హత్తుకునే వీడియో Instagramలో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు 19 లక్షల మందికి పైగా లైక్ చేయగా.. ఈ సంఖ్య మరింత పెరుగుతోంది. వీడియోను చూసిన తర్వాత, ప్రజలు తమ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో చెబుతున్నారు. సోదరా, మీరు నిజమైన హీరో అని ఒకరు, ఎంత పొగిడినా అది తక్కువేనని మరొకరు ఇలా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..