రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి తమ తప్పిదం వల్ల ప్రమాదం జరిగితే, ఒక్కోసారి ఇతరుల మూర్ఖత్వం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయి. ఇక ప్రమాదం ఎలాంటిదైనా.. ప్రాణాలు రిస్క్‌లో పడ్డట్టే. అందుకే రోడ్డుపై నడిచేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అన్ని వైపులా చూసుకోవాలని అంటుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు చాలానే వైరల్ అవుతుంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ బైకర్ తన పక్కనే వెళ్తున్న పెద్ద ట్రక్‌ను ఓవర్ టేక్ చేయాలనుకుంటున్నట్లు మీరు చూడవచ్చు. ఒకవైపు కొన్ని పార్క్ చేసిన వాహనాలు ఉన్నాయి. వాటి దగ్గర నుంచే ఈ బైక్ రైడర్ ట్రక్‌ను దాటేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఇంతలోనే పార్క్ చేసిన కారు డోర్‌ను అకస్మాత్తుగా ఓ వ్యక్తి తెరుస్తాడు. అంతే! బైక్ రైడర్ కాస్తా రోడ్డుపై పడగా.. అతడి మీద నుంచి ట్రక్ దూసుకెళ్తుంది.
అయితే ట్రక్ డ్రైవర్ క్షణాల్లో బ్రేక్ వేయడంతో.. బైక్ రైడర్ పెను ప్రమాదం నుంచి రెప్పపాటులో తప్పించుకుంటాడు. లేకపోతే అక్కడ చిన్న తేడా జరిగినా అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. కాగా, ఈ షాకింగ్ వీడియోను ‘Shocking Videos’ అనే ట్విట్టర్ ఖాతా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ 21 సెకన్ల వీడియోకు ఇప్పటివరకు 19 వేలకు పైగా వ్యూస్, 500 వందలకు పైగా లైకులు వచ్చాయి. లేట్ ఎందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
— Shocking Videos (@ShockingClip) September 9, 2022