Watch Video: ఇలా ఉన్నారేంట్రా బాబు.. ట్రాఫిక్‌లో ఈ కక్కుర్తి పనులేంటి..? వైరల్‌ వీడియోపై నెటిజన్ల ఫైర్‌

|

Mar 28, 2024 | 1:50 PM

ఈ వీడియోలో ఒక బైక్ రైడర్ రోడ్డు పక్కన బండి నుండి ద్రాక్షపండ్లను దొంగిలించడం కనిపిస్తుంది. రహదారిపై ట్రాఫిక్‌ కారణంగా వాహనాలు నిదానంగా వెళ్తున్నాయి. అదే సమయంలో బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి వారి పక్కనుంచి వెళ్తున్న తోపూడు బండిలోంచి రెండు మూడు ద్రాక్ష పళ్లను తీయడానికి ప్రయత్నించాడు. అయితే బైక్ వేగం

Watch Video: ఇలా ఉన్నారేంట్రా బాబు.. ట్రాఫిక్‌లో ఈ కక్కుర్తి పనులేంటి..? వైరల్‌ వీడియోపై నెటిజన్ల ఫైర్‌
Bike Rider Stealing Grapes
Follow us on

దొంగతనం ఘటనలు ప్రపంచవ్యాప్తంగా సర్వసాధారణంగా మారాయి. చోరీ కేసుల్లోనూ కొన్ని ఘటనలు ఆశ్చర్యకరంగా జరుగుతుంటాయి.. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక బైక్‌ రైడర్‌ రోడ్డు పక్కన తోపూడు బండిలో తరలిస్తున్న ద్రాక్ష పండ్లను దొంగిలించిన తీరు ఫన్నీగా కనిపించింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాల రద్దీ కారణంగా వెహికిల్స్‌ అన్నీ ఆ సమయంలో నెమ్మదిగా వెళ్తున్నాయి. దీంతో సదరు బైక్‌ రైడర్‌ ఇలా గ్రేప్స్‌ లూటీకి పాల్పడ్డాడు..ఇంటర్నెట్ వినియోగదారులు ఈ వీడియోపై తీవ్రస్థాయిలో స్పందించారు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక బైక్ రైడర్ రోడ్డు పక్కన బండి నుండి ద్రాక్షపండ్లను దొంగిలించడం కనిపిస్తుంది. రహదారిపై ట్రాఫిక్‌ కారణంగా వాహనాలు నిదానంగా వెళ్తున్నాయి. అదే సమయంలో బైక్‌పై వెనుక కూర్చున్న వ్యక్తి వారి పక్కనుంచి వెళ్తున్న తోపూడు బండిలోంచి రెండు మూడు ద్రాక్ష పళ్లను తీయడానికి ప్రయత్నించాడు. అయితే బైక్ వేగం పెరగడంతో మొత్తం ద్రాక్ష గుత్తిని చేతిలోకి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియోను @HasnaZaruriHai అనే వినియోగదారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్‌ చేసారు. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు..మీరు రూ. 2 లక్షల విలువైన బైక్‌ కొనుగోలు చేయవచ్చు, కానీ రూ. 20 విలువైన ద్రాక్షను కొనుగోలు చేయలేరా.?’ అనే క్యాప్షన్‌ రాశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 76 వేల మందికి పైగా వీక్షించారు.

వైరల్ అవుతున్న వీడియోపై జనాలు పెద్ద ఎత్తున రియాక్షన్ ఇచ్చారు. వీడియో చూసిన జనాలు ఘాటుగా స్పందించారు. ఒక వినియోగదారు స్పందిస్తూ.. ఇదంతా కావాలనే చేసినట్టుగా ఉందన్నారు. లేకపోతే ఆ బండి యజమాని అనుమతి లేకుండా అలా బండి నుండి పళ్లను తీసుకుని పారిపోతే, ఆ బండి యజమాని ఎందుకు అరవలేదు అని అడుగుతున్నారు..? ఇలా చాలా మంది వినియోగదారులు దీనిపై రకరకాల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…