Viral Video: హైవే పై భారీ ప్రమాదం.. ఏకకాలంలో 10-15 బైక్‌లు జారిపడిన వైనం.. షాకింగ్ వీడియో వైరల్

బైక్‌లు ఒకదాని తర్వాత ఒకటి రోడ్డుపై ఎలా పడిపోతున్నాయో వీడియోలో చూడవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి అలా సుమారు 10 నుంచి 15 బైక్‌లు రోడ్డుపై పడటం ప్రారంభించాయి.

Viral Video: హైవే పై భారీ ప్రమాదం.. ఏకకాలంలో 10-15 బైక్‌లు జారిపడిన వైనం.. షాకింగ్ వీడియో వైరల్
Accident Viral Video

Updated on: Jul 23, 2022 | 11:34 AM

Viral Video: సర్వసాధారణంగా హైవే పై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం రహదారిపై వాహనదారులు అతి వేగంగా కారు నడపడం. ఇక దీనికి వర్షాలు తోడైతే.. ఆ ప్రమాదాలు మరింత అధికం అవుతాయి.  ముఖ్యంగా రోడ్డుపై బుల్లెట్ వేగంతో బైక్స్ నడుపుతున్న వారితో ప్రమాదానికి గురయ్యే అవకాశాలు చాలా వరకు అధిమవుతున్నాయి. రోడ్డుమీద వేగంగా వెళ్తున్న బైక్‌లు ఒకదాని తర్వాత ఒకటి పడటం ప్రారంభిస్తే? అపుడు ఆ సన్నివేశం ఎలా ఉంటుందో తలచుకోవడానికే భయంగా ఉంటుంది కదా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది.

వాహనం నడుపుతున్న రైడర్ తన తప్పుతో చాలాసార్లు ప్రమాదానికి గురయ్యే వీడియోలను చూసి ఉంటారు. అయితే  ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో కొంచెం వింతగా ఉంది. ఈ వీడియో చాలా భయానకంగా ఉంది.. ఈ వీడియో చూస్తుంటే.. కొంత సమయం వరకు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోలేరు. హైవే పై అకస్మాత్తుగా బైక్స్ ప్రమాదానికి గురయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

బైక్‌లు ఒకదాని తర్వాత ఒకటి రోడ్డుపై ఎలా పడిపోతున్నాయో వీడియోలో చూడవచ్చు. ఒకదాని తర్వాత ఒకటి అలా సుమారు 10 నుంచి 15 బైక్‌లు రోడ్డుపై పడటం ప్రారంభించాయి. హైవేపై ఇది ఎలా అని జరిగింది అని ఆలోచిస్తే.. ఇక్కడ చాలా ఆయిల్ ఫాల్ అయ్యి ఉంటుందని..  వర్షం కారణంగా ఈ ప్రదేశంలో బైక్స్ స్కిడ్ అయ్యాయని తెలుస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి బైక్స్ జారి పడిపోయాయి.

ఈ షాకింగ్ వీడియో doomzday_official అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో షేర్ చేయబడింది. ఈ వీడియోకి  ‘చమురు + తడి రోడ్డు’ అనే క్యాప్షన్ ను జత చేశారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు దాదాపు 5 లక్షల లైక్‌లు వచ్చాయి. ఇప్పటి వరకు చాలా మంది ఈ వీడియోను చూశారు. రోడ్డుపై వెన్న పూసినట్లుంది.’ , ‘ఈ వ్యక్తులందరూ చాలా తీవ్రంగా గాయపడ్డారని వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..