Viral: యాక్సిడెంట్ అయితే సాయం చేస్తున్నారు అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే.. ‘ఛా వెదవలు’ అంటారు

|

Apr 01, 2022 | 3:38 PM

అబ్బా ఎంత మంచి మనుషులు.. యాక్సిడెంట్ అవ్వగానే సాయం చేయడానికి ఎగబడి వెళ్లారు అనుకోకండి. అసలు విషయం తెలిస్తే కంగుతింటారు...

Viral: యాక్సిడెంట్ అయితే సాయం చేస్తున్నారు అనుకునేరు.. అసలు విషయం తెలిస్తే.. ఛా వెదవలు అంటారు
Bihar Car Accident
Follow us on

Trending Video: పల్టీలు కొట్టిన కారు వద్దకు జనాలు ఎలా పరిగెత్తుకొస్తున్నారో చూడండి. కారు మీదకి ఎక్కి కాళ్లకు దెబ్బ తగులుతున్నా పట్టించుకోకుండా..  హైరానా పడిపోతున్నారు. అయ్యో వీరిది ఎంత జాలి గుణం ఫిక్సయిపోకండి. అక్కడ వ్యవహారం వేరే ఉంది. అవును.. వీరు ఎగబడి వచ్చింది కారులోని ప్రయాణీకులు గురించి కాదు.. అందులోని లిక్కర్ బాటిల్స్ కోసం. వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌(Bihar)లోని కైమూర్(Kaimur)వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. కారు రోడ్డు పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. అందులోని ప్రయాణీకులకు స్వల్ప గాయాలయ్యాయి. వారు పక్కకు వెళ్లడమే ఆలస్యం.. ఆ కారులో మందు కాటన్స్ ఉన్నాయని కనిపెట్టిన జనాలు ఇలా ఎగబడ్డారు. దొరికినవాళ్లు.. దొరికినట్లు మందు బాటిల్స్ ఇళ్లకు ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఆ కారులోని మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలిసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ‘వీరి సేవాగుణానికి, మందు పట్ల ఉన్న మంచితనానికి క్వారర్ల దండ మెడలో వేయాలి.. ప్రెసిడెంట్ మెడల్ ఫుల్ బాటిల్ గిఫ్ట్‌గా ఇవ్వాలి’ అని సరదాగా రాసుకొచ్చాడు ఓ నెటిజన్.

Also Read: AP: పాముకు చేప నైవేద్యం.. మైకంలో కాలనాగుతో ముచ్చట్లు.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో