Viral Video: కోడి- పాము మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..

తన పిల్లలను కాపాడుకోవడం కోసం మనిషైనా.. ఏ జీవి అయినా ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుంటాయి. జంతువులు తమ పిల్లలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు..

Viral Video: కోడి- పాము మధ్య భీకర పోరు.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
King Cobra And Hen

Updated on: Feb 22, 2022 | 7:30 AM

Viral Video: తన పిల్లలను కాపాడుకోవడం కోసం మనిషైనా.. ఏ జీవి అయినా ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుంటాయి. జంతువులు తమ పిల్లలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు, వాటికీ సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చాలా వింత వీడియోలు జంతువులకు సంబంధించినవే. ఇక పాము అంటే ఎవరికీ భయముండదు..? పామును చూడగానే అందరం పారిపోవడానికి ప్రయత్నిస్తాం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న ఈ వీడియోలో పాము, కోడి మధ్య జరిగిన యుద్ధాన్ని చూడొచ్చు.

ఒక కోడి తన పిల్లలను కాపాడుకోవడానికి ఎంతటి జత్తువుతోనైన తలపడుతుంది. ఈ వీడియోలో ఓ కోడి గుడ్లను పొదుగుతున్న సమయంలో అక్కడికి ఓ ఒక భారీ త్రాచు పాము వస్తుంది. ఆ పాము గుడ్లను మింగాలని వాటి వైపు చూస్తుంది. కోడి కూడా నాగుపాము వైపు చూస్తుంది.. బుసలు కొడితే కోడి పారిపోతుంది ఆతర్వాత గుడ్లను తినెయ్యవచ్చని పాము భావిస్తుంది. కానీ కోడి భయపడి పారిపోకుండా నాగుపామును ధైర్యంగా ఎదుర్కొంది. కోబ్రా గుడ్డు పట్టుకునేందుకు కోడిపై దాడికి ప్రయత్నించినా.. కోడి ఇక్కడ కూడా వెనక్కి తగ్గదు. పాము కోడి తలపై కాటు వేసేందుకు పాము ప్రయత్నించినా  కోడి తన ముక్కుతో పాము తలపై పొడుస్తుంది.!! అలా పాము, కోడి మధ్య పోరు కొనసాగుతోంది. చివరికి పాము ఓడిపోయి వెనక్కి తగ్గుతుంది. కోడి పామును తరుముతూ తన గుడ్లను కాపాడుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Video: కూతురిపై ప్రేమతో నాన్న ఇలా చేశాడు..కట్ చేస్తే దెబ్బకు ఫ్యూజులు ఔట్..

Viral Video: పెళ్లి వేడుకలో లొల్లి.. నడి రోడ్డుపై చిత్తుగా కొట్టుకున్న బంధువులు.. నెట్టింట్లో వీడియో వైరల్..

Viral Video: పిచ్చి పీక్స్‌కి వెళ్తే ఇలానే ఉంటుంది… బాక్సులు లేకపోతే బతుకు బస్టాండే..