
రైళ్లలో నిత్యం దొంగతనాలు జరుగుతూనే ఉంటాయి. ప్రయాణీకులు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా దొంగలు రెచ్చిపోతారు. తాజాగా బీహార్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ రైల్వేస్టేషన్‌లో రైలు కదిలేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో ఒక దొంగ కిటికీలోకి చేతులు పెట్టి రైల్లోని వ్యక్తి సెల్‌ఫోన్ కొట్టేయాలనుకున్నాడు. కానీ, ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండటంతో.. దొంగ చేతులను గట్టిగా పట్టుకున్నారు. అలా రైలు కిలోమీటర్ వెళ్లేవరకు కిటీకిలోంచి అతను వేలాడుతూనే ఉన్నాడు. పైగా దారి పొడవునా ప్రయాణికులు అతన్ని దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.
రైలు కిటికీలోంచి మొబైల్ లాక్కోవడానికి యువకుడు ప్రయత్నించగానే, మరో ప్రయాణీకుడు వెంటనే అతని చేయి పట్టుకున్నాడు. ఆ తర్వాత జనం గుమిగూడి అతనికి గుణపాఠం చెప్పడం ప్రారంభించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదంతా కదులుతున్న రైలులో జరిగింది. అయితే,ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు కంప్లైట్ ఇచ్చారా లేదా అనేది తెలియరాలేదు.
వీడియో ఇక్కడ చూడండి..
నెట్టింట వీడియో వైరల్‌గా మారడంతో ప్రజలు రకరకాల ఫన్నీ రియాక్షన్లు ఇస్తున్నారు. రైలు ప్రయాణంలో ఇలాంటి చోరీలకు సంబంధించిన ఘటనలు పెరిగాయంటూ కూడా కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు. నిందితుడిని పట్టుకుని వెంటనే పోలీసులకు సమాచారం అందించాలంటూ మరికొందరు సూచించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..