అరె తమ్ముడూ.! ఇలాంటి ఫీట్స్ చేస్తే డైరెక్ట్‌గా యముడికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టే..
సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో బైకులపై యువత చిత్రవిచిత్రమైన చేష్టలు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమికులు బైక్‌పై ముద్దులు పెట్టుకుంటూ.. నడిరోడ్డుపై రెచ్చిపోతుంటే.. మరికొందరు బైక్‌పై స్నానాలు కానిస్తూ.. మీరూ లేటెస్ట్ వీడియోపై ఓ లుక్కేయండి..
సోషల్ మీడియాలో తరచూ వైరల్ వీడియోలు చక్కర్లు కొడుతుంటాయి. ఇక ఈ మధ్యకాలంలో బైకులపై యువత చిత్రవిచిత్రమైన చేష్టలు చేస్తుండటం మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమికులు బైక్‌పై ముద్దులు పెట్టుకుంటూ.. నడిరోడ్డుపై రెచ్చిపోతుంటే.. మరికొందరు బైక్‌పై స్నానాలు కానిస్తూ.. వైరల్ అవుతున్నారు. ఇక సరిగ్గా ఇలాంటి ఘటనల మాదిరిగానే మరొకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
వైరల్ వీడియో ప్రకారం.. బెంగళూరు వీధుల్లో స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తి.. ఒకవైపు డ్రైవింగ్ చేస్తూ.. హ్యాండిల్స్ చేస్తుండగా.. మరోవైపు తన ఒళ్లో ల్యాప్‌టాప్ పెట్టుకుని జూమ్ కాల్ అటెండ్ అవుతున్నాడు. ఇలా కొందరు బైక్ నడుపుతూ.. ల్యాప్‌టాప్ హ్యాండిల్ చేయడం కొత్తేమికాదు.. గతంలోనూ కొందరు బైక్ నడుపుతూనే తమ ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియో హల్చల్ అయ్యాయి.
ఇక ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలోని వ్యక్తి.. స్కూటీని డ్రైవ్ చేస్తూనే.. మరోవైపు జూమ్ యాప్‌లో సమాధానాలు ఇస్తున్నాడు. అటుగా వెళ్తున్న కొందరు దీన్ని వీడియో తీయగా.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ‘వామ్మో.! ఇలాంటి చిత్రవిచిత్రమైన మనుషులు మన దగ్గరే ఉంటారు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ఇలాంటి పనులు చాలా ప్రమాదకరం అని మరొకరు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. లేట్ ఎందుకు మీరూ వీడియోపై లుక్కేయండి.
Bengaluru is not for beginners 😂
(🎥: @nikil_89) pic.twitter.com/mgtchMDryW
— Peak Bengaluru (@peakbengaluru) March 23, 2024