Viral: పైకేమో సబ్బుల యాపారం.. తీరా చూస్తే లోపల జరిగేది చీకటి యవ్వారం.!

|

Dec 13, 2023 | 3:53 PM

పైకేమో అతడు చేసేది పతీతు వ్యాపారం.. సబ్బులు, చాక్లెట్లు, బెడ్ షీట్ కవర్లు ఇలాంటివన్నీ అమ్ముతుంటాడు. కానీ ఓ రోజు పోలీసులు అతడి వద్దకు వెళ్లి లోతుగా చెక్ చేయగా.. దిమ్మతిరిగిపోయింది. ఇంతకీ అసలేం ఏం జరిగింది.? ఈ ఘటన ఎక్కడ జరిగింది.? ఆ తర్వాత ఏమైంది.. అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Viral: పైకేమో సబ్బుల యాపారం.. తీరా చూస్తే లోపల జరిగేది చీకటి యవ్వారం.!
Representative Image
Follow us on

మరికొద్దిరోజుల్లో న్యూ ఇయర్‌ రాబోతున్న వేళ బెంగళూరులో భారీగా డగ్స్‌ పట్టుబడటం కలకలం రేపింది. బెంగళూరు సిటీలో 21 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు క్రైం బ్రాంచ్‌ పోలీసులు. ఆఫ్రికాకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 21 కోట్ల రూపాయల విలువైన 16కిలోల MDMA, 500 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ ఆఫ్రికన్ బెంగళూరు నగరంలోని రామమూర్తినగర్‌లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు పోలీసులు.

ఆఫ్రికాలో జన్మించిన లియోనార్డ్.. వ్యాపారం నిమిత్తం బెంగళూరుకు వచ్చాడు. వీసా ద్వారా వచ్చిన లియోనార్డ్‌.. రామమూర్తినగర్‌లో స్థిరపడ్డాడు. ఈ క్రమంలోనే.. కొత్త సంవత్సరం వేడుకల కోసం భారీ మొత్తంలో డ్రగ్స్ తీసుకొచ్చాడు. అయితే.. సీసీబీ పోలీసులు ఆపరేషన్ నిర్వహించి నిందితులను అరెస్ట్ చేసి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బెడ్ షీట్ కవర్లు, సబ్బు పెట్టెలు, చాక్లెట్ బాక్సుల్లో డ్రగ్స్ రవాణా చేస్తున్నాడు. న్యూ ఇయర్ కోసం రేవ్ పార్టీకి డ్రగ్స్ రవాణా చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు. బెంగళూరు రామమూర్తినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.