Viral photo : ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్‌ చేసిన కస్టమర్‌కు ఐరన్‌ పీస్‌ దొరికింది.. అతడి రియాక్షన్‌ చూడాలి..నెటిజన్ల ఫైర్‌..

|

Jan 13, 2024 | 12:16 PM

షావర్మాలో ఆ ఇనుప ముక్క, మొత్తం బిల్లు, Swiggy కస్టమర్ సపోర్ట్‌తో చేసిన చాట్ స్క్రీన్‌షాట్‌ని కూడా అతడు షేర్‌ చేశాడు. ఈ పోస్ట్ 2024 జనవరి 11 న షేర్ చేయగా, ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఈ విషయంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా కొందరు సలహాలు ఇచ్చారు. తనకు కూడా..

Viral photo : ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్‌ చేసిన కస్టమర్‌కు ఐరన్‌ పీస్‌ దొరికింది.. అతడి రియాక్షన్‌ చూడాలి..నెటిజన్ల ఫైర్‌..
Swiggy
Follow us on

ప్రస్తుతం అందరూ ఆన్‌లైన్‌ షాపింగ్‌పైనే ఆధారపడుతున్నారు. వివిధ యాప్‌లను ఉపయోగించి కిరాణా లేదా ఆహారాన్ని ఆర్డర్ చేస్తుంటారు. ఏ వస్తువైనా సరే.. ఆర్డర్‌ ఇచ్చిన నిమిషాల వ్యవధిలోనే మన ఇంటికి వచ్చేస్తుంది. దీంతో ప్రజల జీవన విధానం మరింత సులువుగా మారింది. అయితే, ఇలా ఆన్‌లైన్‌ ఆర్డర్‌ ఇచ్చిన అన్ని వస్తువులు దాదాపుగా నాణ్యత, మెరుగైనవే వచ్చినప్పటికీ కొన్నిసార్లు మనకు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు మనల్ని నిరాశకు గురిచేస్తుంటాయి. ప్రస్తుతం బెంగుళూరులో ఉంటున్న ఓ వ్యక్తికి అలాంటి అనుభవమే ఎదురైంది. ఇక్కడ ఒక వ్యక్తి స్విగ్గీ నుంచి చికెన్ షావర్మా ఆర్డర్ చేశాడు. కానీ, పార్సిల్‌లో అతనికి వచ్చిన వస్తువు చూసి అతడు కంగుతిన్నాడు..తాను పెట్టిన ఆర్డర్‌ ప్రకారం షావర్మాకు బదులుగా అందులో చిన్న ఇనుప ముక్క వచ్చింది. అతను దాన్ని ఫోటో తీసి షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది.

స్థానికంగా ఉన్న షావర్మా సెంటర్‌ నుండి అతడు చికెన్ షావర్మాను ఆర్డర్ చేశాడు. ఇందుకోసం ఫు0డ్ డెలివరీ యాప్ అయిన స్విగ్గీని ఉపయోగించాడు. ఇంటికి వచ్చి ఫుడ్‌ తింటున్న క్రమంలో అతని నోటికిఏదో గట్టిగా తగిలింది.. దాంతో ఎంటా పదార్థం అని చూడగా..అది ఒక ఐరన్‌ ముక్క. షావర్మా కోసం చికెన్‌ను కాల్చుతుండగా, దాని ముందు ఉంచిన ఇనుప తురుము ముక్క అని ఆ వ్యక్తి గమనించాడు. అతను దీని గురించి యాప్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే Swiggy సపోర్ట్ ఏజెంట్ అన్నింటినీ చాలా తేలికగా తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. Swiggy సపోర్ట్ ఏజెంట్ వీటన్నింటిపై అస్సలు శ్రద్ధ చూపడం లేదని అతడు ఆరోపించాడు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారా లేదా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి స్వయంగా పరిశీలిస్తారా? అన్నది వేచి చూడాలి.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ రెడ్డిట్ ఫోటోలో సగం తిన్న షావర్మాలో ఆ ఇనుప ముక్క, మొత్తం బిల్లు, Swiggy కస్టమర్ సపోర్ట్‌తో చేసిన చాట్ స్క్రీన్‌షాట్‌ని కూడా అతడు షేర్‌ చేశాడు. ఈ పోస్ట్ 2024 జనవరి 11 న షేర్ చేయగా, ప్రస్తుతం ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఈ విషయంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో కూడా కొందరు సలహాలు ఇచ్చారు. తనకు కూడా ఇలాగే జరిగిందంటూ ఒకరు తమ అనుభవాన్ని పంచుకున్నారు.. తాను Swiggy నుండి పిజ్జాను ఆర్డర్ చేయగా అందులో గోర్లు కనిపించాయని, తాను క్లెమ్‌ చేయగా, షాప్‌ వారి నుండి పూర్తి డబ్బు వాపసు పొందానని చెప్పాడు. మీరు కూడా మళ్లీ ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించండి. వీలైతే ఫోన్‌లో మాట్లాడండి. అలా చేయటమే చాట్‌ల కంటే బెటర్‌ అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..