
బెంగళూరుకు చెందిన హజిల్ అనే జెప్టూ డెలివరీ బాయ్ తన రెడ్డిట్ ఖాతాలో తన వారపు సంపాదనకు సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్‌ను పంచుకున్నాడు. పోస్ట్ శీర్షికలో తాను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రోజుకు 12 గంటలు పనిచేస్తానని పేర్కొన్నాడు. అంతేకాదు వారంలో దాదాపు 387 ఆర్డర్‌లను కస్టమర్లకు డెలివరీ చేస్తాడని.. బైక్ పెట్రోల్ ఖర్చులు సహా ఇతర ఖర్చులను మినహాయించి వారానికి రూ.18,906 సంపాదిస్తున్నానని వెల్లడించాడు.
ఆ వైరల్ పోస్ట్ ని ఇక్కడ చూడండి.
What I earned in a week (working morning 10am to night 10pm) as zepto delivery
byu/samfucku inSideHustlePaglu
ఆ యూజర్ తన 40వ వారానికి సంబంధించిన ఆదాయ వివరాలను షేర్ చేశాడు. ఆ వారం సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 5 వరకు ఉంది. స్క్రీన్‌షాట్‌లో అక్టోబర్ 2, అక్టోబర్ 2, అక్టోబర్ 4 , అక్టోబర్ 5 తేదీలలో వరుసగా రూ.3,749.4, రూ.3,379.9, రూ.2,460.3 , రూ.4,020.3 మొత్తం ఆదాయాలు చూపించబడ్డాయి
వర్షం కారణంగా ప్రజలు ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్‌లో డెలివరీ బాయ్ వారంలో రూ. 21,000 సంపాదిస్తున్న విషయాన్నీ చూడవచ్చు. మూడు రోజుల్లో రూ. 12,000 సంపాదించాడు. వారంలో వరుసగా రెండు రోజులు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు సంపాదించిన డబ్బు గురించి తెలియజేశాడు. అంతేకాదు వర్షం పడినప్పుడు ఎక్కువ ఆర్డర్లు వస్తాయని.. అప్పుడు డబ్బు ఎక్కువ సంపాదించవచ్చనే విషయం కూడా ఈ పోస్ట్ చూస్తే తెలుస్తుంది.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో, వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక వినియోగదారుడు వారంలో అంత సంపాదించడం సాధ్యమేనా అని అడిగారు. మరొక వినియోగదారుడు, “డెలివరీ బాయ్స్ అంత సంపాదిస్తారని నేను అనుకోను” అని అన్నారు. ఇది చూసిన మరొక వినియోగదారుడు కంపెనీలలో పనిచేయడం కంటే డెలివరీ బాయ్‌గా మారడం మంచిదని వ్యాఖ్యానించారు. మరికొందరు డెలివరీ బాయ్ కృషిని ప్రశంసించారు
మరిన్ని వైరల్ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి