అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెక్షన్.. ఎక్కడంటే..

|

Nov 06, 2024 | 3:47 PM

ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి. ఈ వ్యాధి బారినపడ్డ వారిలో కండరాలు బలహీనంగా ఉండటం, శరీరంలోని ఏదో ఒక అవయవంలో కదలికలు లేకపోవడం దీని ప్రధాన లక్షణం. చికిత్స తీసుకోకుంటే అనారోగ్యం తీవ్రమై మంచానికే పరిమితమవ్వాల్సి ఉంటుంది.

అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి రూ.16 కోట్ల ఇంజెక్షన్.. ఎక్కడంటే..
a child suffering from a rare disease
Follow us on

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. పశ్చిమ బెంగాల్‌‌కు చెందిన దిన్ మహ్మద్ అనే చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. అయితే ఈ వ్యాధి నయం కావాలంటే రూ. 16 కోట్ల జొల్జెన్‌స్మా ఇంజక్షన్ వేయాలని వైద్యులు సూచించారు. అంతా డబ్బు చిన్నారి కుటుంబ సభ్యుల వద్ద లేకపోవడంతో.. దాతలు, ప్రభుత్వ సాయంతో తాజాగా బాలుడికి ఆ ఇంజక్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు కోల్‌కతా వైద్యులు తెలిపారు.

ఎస్‌ఎంఏ.. స్పైనల్‌ మస్క్యులార్‌ ఆట్రొఫీ..అనేది ఒక నరాల వ్యాధి. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి. ఈ వ్యాధి బారినపడ్డ వారిలో కండరాలు బలహీనంగా ఉండటం, శరీరంలోని ఏదో ఒక అవయవంలో కదలికలు లేకపోవడం దీని ప్రధాన లక్షణం. చికిత్స తీసుకోకుంటే అనారోగ్యం తీవ్రమై మంచానికే పరిమితమవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా దక్కవు. అయితే, ఈ వ్యాధికి చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..