సోషల్ మీడియా అంటేనే వింతలు, విడ్డూరాలకు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ ప్రతిరోజూ వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచింపజేసేవిగా ఉంటాయి. మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇంకొన్ని భయాందోళన కలిగిస్తుంటాయి. అలాంటి వీడియోల్లో కొన్ని ఒకటి కంటే ఎక్కువ ప్రమాదకరమైనవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలా సార్లు ప్రజలు తమ శౌర్యాన్ని ప్రదర్శిస్తూ భయంకరమైన జంతువులతో వీడియోలు తీస్తుంటారు. కొందరు భయంకర, ప్రాణాంతక పాములతో చెలగాటం ఆడుతుంటారు. కొందరు కింగ్‌కోబ్రాలాంటి విషపాములను ముద్దుపెడుతూ కూడా వీడియో తీసుకుంటారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, లైకులు, కామెంట్ల కోసం ఆరాటపడుతుంటారు. అలాంటిదే మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. అది మిమ్మల్ని నిజంగా భయపెడుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తన గడ్డం నిండా తేనెటీగలను ధరించాడు. చెట్టుపై తేనెటీగల పుట్టను చూసి ఉంటారు.. గ్రామాల్లో ఎక్కువగా ఇళ్లను అంటిపెట్టుకుని కూడా తేనెటీగలు కూడుకట్టుకోవటం చూసి ఉంటారు..కానీ, ఇలా మనిషి తన గడ్డం నిండా తేనెటీగలను పెంచుకోవటంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. వినియోగదారులు కూడా నిరంతరం కామెంట్ చేస్తున్నారు.
ఒక తేనెటీగ కుడితేనే..ఆ నొప్పిని భరించలేం. తేనెటీగ కుడితే.. ఆ మనిషి శరీరంలో వాపు, విపరీతమైన నొప్పి కలుగుతుంది. అప్పుడప్పుడు తేనెటీగల గుంపులు ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంటాయి. వాటిని చూసిన వెంటనే ప్రజలు అక్కడ్నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తారు. కానీ, ఈ వీడియోలోని వ్యక్తి నిర్భయంగా గడ్డం, ముఖం మీదే తేనెటీగలను పెట్టుకుంటున్నాడు. ముఖం, గడ్డంతో పాటు.. అతని ఛాతీ, కడుపు వరకు వ్యాపించింది తేనెతుట్టి. వ్యక్తి ముఖం మీద కూడా కొన్ని తేనెటీగలు ఎగురుతూ కనిపిస్తున్నాయి.
తేనెటీగల గుంపు ఆ వ్యక్తి మొత్తం శరీరంపైకి వేలాడుతోంది. అయితే ఇది ఉన్నప్పటికీ అతను తేనెను తీయడం కనిపిస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తి ఎలాంటి భద్రత లేకుండా తన ముఖంపై తేనెటీగలను వేలాడదీసుకున్నాడు. అలాగే అతను కెమెరాతో మాట్లాడుతున్నట్లు కూడా కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన చాలా మంది యూజర్లు షాక్ అవుతున్నారు. వీడియోపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..