Viral Video: నెట్టింట వైరల్ వీడియోలకు కొదవే ఉండదు. నిత్యం వందల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అడవి జంతువుల వీడియోలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు నెటిజన్లు. కొన్ని వీడియోలు మిమ్మల్ని నవ్విస్తే, కొన్ని మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి, ఏడ్చేస్తాయి మరియు ఆశ్చర్యపరుస్తాయి.
తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎలుగు బంట్లు ఇటీవల జనావాసంలోకి వస్తున్న వార్తలు రోజూ వింటూ ఉన్నాం. తాజాగా ఓ ఎలుగు బంటి తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎలుగు బంటి పిల్లలు సరదాగా ఆడుకుంటూ కనిపించాయి. ఒక ఉయ్యాలలో ఎక్కి ఆడుకునేందుకు ఆ ఎలుగు బంటి పిల్లలు నానా తిప్పలు పడ్డాయి. ఒక చెట్టుకు కట్టి ఉన్న నెట్ ఉయ్యాలను ఎక్కడానికి రెండు ఎలుగుబంటి పిల్లలు పడిన తిప్పలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆ ఉయ్యాలను ఎక్కలేక కిందపడుతున్నప్పటికీ అవి ప్రయత్నిస్తూనే ఉన్నాయి. సుధా రామన్ ఖాతా నుంచి ఈ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. మనుషులే కాదు జంతువులు కూడా ఆనందంగా గడుపుతాయి. ఎ కామన్ ఇన్సిడెంట్ అమాంగ్ బేర్స్ అనే క్యాప్షన్‌తో వీడియో షేర్ చేయబడింది. ఈ వీడియోను ఇప్పటికే 9 మిలియన్లకు పైగా ప్రజలు వ్యూస్. ఈ వీడియోకు చాలా మంది లైక్‌లు, కామెంట్లు చేస్తున్నారు.
Nothing says the weekend like some bear cubs trying to get in a hammock. pic.twitter.com/ibm152kTwL
— Paul Bronks (@SlenderSherbet) June 18, 2022