Funny Video: సాధారణంగా ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడో ఒకసారి గెట్ టు గెదర్ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటారు. అందరూ కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తారు. ఆటలు, పాటలతో అలరిస్తారు. ఆ డే ని మెమరబుల్‌గా మార్చేస్తారు. మరి జంతువులు కూడా గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకుంటాయని తెలుసా? ఆ గెట్ టు గెదర్ ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూశారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. ఎలుగుబంట్లు సాధారణంగానే ఎక్కువగా చేపలను ఆహారంగా తీసుకుంటాయి. నీటి ప్రవాహం ఉన్న చోటకు వెళ్లి.. చేపలను వేటాడి కడుపు నింపుకుంటాయి. అయితే, గుంపుగా వెళ్లి వేటాడి తినడమే ఇక్కడ వెరీ స్పెషల్ అని చెప్పుకోవాలి. పదుల సంఖ్యలో ఎలుగుబంట్లు సెలయేరు వద్దకు వెళ్లి చేపల వేట సాగించాయి. అందినకాడికి కడుపు నిండా తినేశాయి. దీనికి సంబంధించిన వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విట్టర్‌లో షేర్ చేశారు. దానికి క్యాప్షన్‌గా ‘వీకెండ్ గెట్ టు గెదర్’ అని పేర్కొన్నారు.
ఈ వీడియోలో కొన్ని ఎలుగుబంట్లు మంద మందకే వచ్చాయి. సెలయేరు అవతలి గట్టు నుంచి ఇవతలి గట్టు వరకు వరసుగా నిలబడ్డాయి. ఎగువ ప్రవాహానికి ఎగురుతున్న చేపలను లటుక్కు పట్టుకుని గుటుక్కున మింగేస్తున్నాయి. చూడటానికి ఈ దృశ్యం చాలా ఆకట్టుకుంటుంది. అందుకే ఈ వీడియోను ఆయన షేర్ చేసిన వెంటనే నెటిజన్లు దాన్ని రీట్వీట్ చేయడం ప్రారంభించారు. ఆ వీడియోకు ఫిదా అయిపోతున్నారు. ఒక్క రోజులోనే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.
Weekend get together☺️ pic.twitter.com/ebH3lhhibg
— Susanta Nanda IFS (@susantananda3) July 30, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..