అడవి జంతువుల వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో కనిపిస్తాయి. చాలా వీడియోలలో, అడవి జంతువులు ఏదో ఒక ప్రత్యేకమైన పనిని చేస్తూ కనిపిస్తాయి.. అదే సమయంలో, అడవి జంతువులను చూడటం కూడా నెటిజన్లు చాలా రిలాక్స్‌గా ఫీలవుతుంటారు. ఈ క్రమంలో సోషల్‌మీడియాలో మరో వీడియో వెలుగులోకి వచ్చింది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ద్వారా వెలువడిన ఈ వీడియోలో, మీరు ఎలుగుబంట్ల గుంపును చూడవచ్చు. సమాచారం ప్రకారం, ఈ వీడియో అమెరికాలోని న్యూ హాంప్‌షైర్ నుండి షేర్ చేయబడింది.. వీడియో టుఫ్టన్‌బోరోలోని ఒక అడవి లో రికార్డైనట్టుగా తెలిసింది. న్యూ హాంప్‌షైర్‌లోని టఫ్ఫోన్‌బోరోలోని అటవీప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రయల్ కెమెరా మే 23న ఎలుగుబంట్ల కుటుంబం ప్రయాణిస్తున్న దృశ్యాలను రికార్డ్ చేసింది. ఈ ఎలుగుబంట్ల కుటుంబం చాలా ప్రశాంతంగా కనిపిస్తోంది. . ప్రకృతి, జంతువులపై ప్రేమ, ఆప్యాయత ఉన్న వ్యక్తులు ఈ వీడియోను చాలా ఇష్టపడ్డారు.
మీడియా నివేదికల ప్రకారం, ఇంటి యజమాని ఎరికా బిక్‌ఫోర్డ్, తాను, ఆమె భర్త గత ఏడాది కాలంగా తమ పిల్లలతో ఆడ ఎలుగుబంట్లను చాలాసార్లు చూశారని చెప్పారు. అయితే వాటిని వీడియో కెమెరా ముందుకు తీసుకురావడం ఇదే తొలిసారిగా చెచెప్పారు. ఎలుగుబంటి ఫ్యామిలీ ఇలా ఈ చలికాలం ఇక్కడే గడిపి పోవడం చూసి మాకు చాలా ఆనందంగా ఉందని ఎరికా బిక్‌ఫోర్డ్ తెలిపింది.
ప్రకృతిని, జంతువులను అమితంగా ఇష్టపడే ఎరికా.. ఆడ ఎలుగుబంట్లు, పిల్లలను చూసి చాలా సంతోషించింది. ఆ అందమైన క్షణాలను తన కెమెరాలో రికార్డ్ చేయలనుకుంది. అనుకున్నదే తడవుగా, ఆ సీన్‌మొత్తాన్ని రికార్డ్ చేసింది. అదే వీడియో ఇప్పుడు నెట్టిజన్లు తెగ ఆకట్టుకుంటోంది.