
ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాలో ఒక షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇది కుటుంబ సభ్యులు, వైద్యులు, గ్రామస్తులను సైతం ఆశ్చర్యపరిచింది. జవహర్‌పూర్ గ్రామానికి చెందిన ఒక యువతి ఇప్పటివరకు 41 సార్లు పాము కాటుకు గురైంది. కానీ, ప్రతిసారీ చికిత్స తర్వాత ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ పాము కుటుంబంలోని మిగిలిన వారికి ఎప్పుడూ హాని కలిగించనప్పటికీ, బాధిత యువతిని మాత్రం పదేపదే లక్ష్యంగా చేసుకుంటుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
గ్రామ నివాసి మునవ్వర్ అలీ కుమార్తె రహమతుల్ బానో గురువారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో మళ్ళీ పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దేవాకు తీసుకెళ్లారు. అక్కడ శుక్రవారం సాయంత్రం 6:35 గంటలకు ఆమెను ఆస్ప్రతిలో చేర్చారు. అపస్మారక స్థితిలో ఉన్న యువతిని వైద్యులు అబ్షర్వేషన్‌లో ఉంచారు. ఈ క్రమంలోనే బాధిత యువతి ఇప్పటికే పాములు 40 సార్లు కాటుకు గురైనట్టుగా చెప్పారు. ఆమెను చికిత్స కోసం లక్నోలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్, ట్రామా సెంటర్‌కు తీసుకెళ్లామని చెప్పారు. అదృష్టవశాత్తు ఆమె ప్రతిసారీ పూర్తి ఆరోగ్యంతో బయటపడింది. ఇది ఒక సినిమా కథలా అనిపించవచ్చు, కానీ ఇది మా వాస్తవికత అని బాధితురాలి సోదరుడు ఆజాద్ చెప్పారు.
మరోవైపు, దేవా సిహెచ్‌సిలో పనిచేస్తున్న వైద్యులు వైద్య దృక్కోణం నుండి ఇటువంటి పరిస్థితి చాలా అరుదు అని అంటున్నారు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం స్థిరంగా ఉందని చెబుతున్నప్పటికీ, కుటుంబం దీనిని ఒక అతీంద్రియ సంఘటనగా భావిస్తోంది. అదే సమయంలో, పాము ఈ అమ్మాయిని పదే పదే ఎందుకు లక్ష్యంగా చేసుకుందనేది గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఈ అమ్మాయిని చాలాసార్లు మా వద్దకు తీసుకువచ్చినట్లు సిహెచ్‌సి సూపరింటెండెంట్ చెప్పారు. ప్రతిసారీ ఆమెను పాము కాటువేసినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. కానీ, ఒక యువతిని 41 సార్లు పాము కాటు వేయడం అనుమానాన్ని కలిగిస్తుందని సిహెచ్‌సి సూపరింటెండెంట్ అన్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..