వింత పెళ్లి..! మైనాను మనువాడిన చిలకమ్మ.. ఊరుఊరంతా తరలివచ్చి మరీ..

|

Feb 08, 2023 | 11:38 AM

మధ్యప్రదేశ్‌లోని కరేలీ సమీపంలోని పిపారియా గ్రామంలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రెండు పక్షులకు కనీవినీ ఎరుగని రీతిలో సంప్రదాయ పద్ధతిలో..

వింత పెళ్లి..! మైనాను మనువాడిన చిలకమ్మ.. ఊరుఊరంతా తరలివచ్చి మరీ..
Birds Special Marriage
Follow us on

మన భారతీయ సంస్కృతిలో పెళ్లికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆకాశమంత పందిరి వేసి, మేళ తాళాల మధ్య ఏడడుగులు, మూడుముళ్ల బంధంతో ఒక్కటవ్వడాన్ని అనాదిగా సంప్రదాయంగా అనుసరిస్తున్నాం. అనంతరం నవ వధువరులను ఊరంతా ఊరేగించి వివాహ వేడుకను ఘనంగా జరుపుకుంటాం. ఐతే మధ్యప్రదేశ్‌లోని కరేలీ సమీపంలోని పిపారియా గ్రామంలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రెండు పక్షులకు కనీవినీ ఎరుగని రీతిలో సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేశాడో వ్యక్తి. రామ చిలుక-మైనాకు ఈ వివాహ తంతు ఏర్పాటు చేశాడు. భారతీయ సంప్రదాయంలో, జాతకాలు కూడా చూసి మరీ పెళ్లి చేశాడా పెద్దమనిషి. పక్షుల పెళ్లిళ్లు కూడా ఇంత సందడిగా చేస్తారా అంటూ అందరూ నోరెళ్లబెట్టారు. నిజానికి..

పిపారియా గ్రామ నివాసి అయిన రామస్వరూప్ పరిహార్ మైనా పక్షిని సొంత కూతురిలా పెంచుకున్నాడట. అదే గ్రామానికి చెందిన బాదల్ లాల్ విశ్వకర్మ కూడా ఓ చిలుకను పెంచుకుంటున్నాడు. మైనా- చిలుకల యజమానులు మాట్లాడుకుని రెండు పక్షులకు పెళ్లి ఖాయం చేశారు. ఆ ప్రకారంగా ఆదివారం నాడు గ్రామ పెద్దలు, ప్రజల సమక్షంలో పెళ్లి చేసి ‘బరాత్’ ఊరేగింపు ఏర్పాటు చేశారు. నాలుగు చక్రాలు కలిగిన పంజరంలో గ్రామ వీధుల్లో పక్షుల జంటను ఊరేగించారు. ఈ వింత పెళ్లిని వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనసమూహం చేరడంతో.. అది కాస్తా ఆనోటాఈనోటా చేరి నలువైపులా పాకి చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.