Viral News: నేటి ఫ్యాషన్ రంగంలో సృజనాత్మకత రోజురోజుకు పెరుగుతోంది. దుస్తులు, చెప్పులు, షూస్ ఇలా ప్రతి దానిలో మోడల్స్ వస్తున్నాయి. కొత్తలో కొత్తగా అనిపించినా.. తరువాత రోజుల్లో అదో ఫ్యాషన్ అయిపోతుంది. గతంలో ఇయర్ రింగ్స్ మహిళలు మాత్రమే పెట్టుకునే వాళ్లు. అలాగే కొన్ని కులాల వాళ్లు వారి ఆచార, సంప్రదాయాల ఆధారంగా పురుషులు చెవి పోగులు పెట్టుకునేవారు. వీరి సంఖ్య పరిమితంగా ఉండేది. కాని ఇప్పుడు యువత చాలా మంది చెవిపోగులు పెట్టుకోవడం ఫ్యాషన్ గా మారిపోయింది. దీంతో రకరకాల మోడల్స్ లో యూత్ ను ఆకర్షించేలా చెవి పోగులు మార్కె్ట్లోకి వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఓ సరికొత్త మోడల్ చెవిపోగులు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈమోడల్ చెవిపోగులను చూసి నెటిజన్లు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది సెటారికల్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇవి చూసినవారంతా ఇవా షూ లేస్ గా అనే అనుకుంటున్నారు. కాని అసలు విషయం తెలిశాక నవ్వు ఆపుకోలేకపోతున్నారు.
అచ్చం షూ లేస్ లాగానే ఉన్న చెవిపోగులు. లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ బాలెన్ సియాగా షూలేస్‌ల వలె కనిపించే చెవిపోగులను ఇటీవల విడుదల చేసింది. పత్తితో పాటు.. పాత వెండి, ఇత్తడి ఆభరణాలు ఉపయోగించి ఈ కొత్త మోడల్ చెవి పోగులను తయారుచేశారు. దీని ధర రూ.20,847.. ఇప్పుడు కొత్త మోడల్ చెవిపోగులు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి సంబధించి రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. ఈచెవిపోగుల్లో రంగులు కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు నెటిజన్లు తమదైన శైలిలో ఈకొత్త మోడల్ చెవిపోగులపై స్పందిస్తున్నారు. ఇది నిజమా.. నమ్మబుద్ధి కావడం లేదంటూ కొంతమంది.. ఇంత రేటు పెట్టి కొనాలా.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
Balenciaga launches earrings that look like shoelaces for Rs 20, 847; netizens react
Read @ANI Story | https://t.co/eFhgGWCMDA#Balenciaga #Shoelaces #Earrings #BalenciagaFashion pic.twitter.com/syvFffdo8e
— ANI Digital (@ani_digital) August 29, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..