Video: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ‘బేబీ షార్క్’ వీడియో..10 మిలియన్ల వ్యూస్ క్రాస్.. మీరు చూశారా..

|

Jan 14, 2022 | 3:11 PM

డిజిటల్ మీడియాలో ఏది ఎప్పుడు దూసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే అందులో ఏదైన విషయం ఉంటే మాత్రం..

Video: యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న బేబీ షార్క్ వీడియో..10 మిలియన్ల వ్యూస్ క్రాస్.. మీరు చూశారా..
Baby Shark
Follow us on

డిజిటల్ మీడియాలో ఏది ఎప్పుడు దూసుకుపోతుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. అయితే అందులో ఏదైన విషయం ఉంటే మాత్రం సక్సెస్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అలాంటి వీడియోలను నెటిజన్లు తెగ లైక్ చేస్తుంటారు. ఇదే కోవలోకి ఓ వీడియో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తోంది. ఈ వీడియో చిన్న పిల్లలను తెగ ఆకట్టుకుంటోంది. ఇద్దరు చిన్నారు డ్యాన్స్ చేస్తూ పడుతున్న పాట ‘బేబీ షార్క్’ వీడియో. ఈ వీడియో మరో మైలురాయిని క్రియేట్ చేసింది. దక్షిణ కొరియా కంపెనీ పింక్‌ఫాంగ్ ఈ వీడియోను తయారు చేసింది. యూట్యూబ్‌లో ఇప్పటికే  10 బిలియన్ల వ్యూస్‌ను దాటిన మొదటి వీడియోగా రికార్డ్ సృష్టించింది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఇదే అత్యధిక వ్యూస్ వచ్చిన వీడియో మాత్రమే కాదు. నవంబర్ 2020లో ఓ వీడియో ఒకటి ఇదే స్థాయిలో రికార్డ్ సృష్టించింది. కానీ ఇప్పుడు సైట్‌లో 10 బిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఏకైక వీడియో ఇదే అని YouTube CNN ధృవీకరించింది.

పిల్లల కోసం కొరియన్ బ్యాండ్ పింక్‌ఫాంగ్ పాటల సిరీస్‌లో భాగంగా జూన్ 2016లో తొలిసారిగా విడుదలైన ‘బేబీ షార్క్’ పాట. “బేబీ షార్క్, డూ, డూ, డూ, డూ, డూ” అనే ట్యూన్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. “డూ.. డూ.” ఈ రైమ్‌ను కొరియన్-అమెరికన్ గాయని హోప్ సెగోయిన్ ఆమె 10 సంవత్సరాల వయస్సులో పాడారు. అప్పటి నుండి ఇది ప్రపంచ సాంస్కృతిక సంచలనంగా మారింది. వాస్తవానికి ప్రతిచోటా పిల్లలకు ఇష్టమైనది!

వీడియోను ఇక్కడ చూడండి:

ఇవి కూడా చదవండి: PM Modi Review Meeting: కోవిడ్‌ వ్యాప్తి, నివారణా చర్యలపై సీఎంలతో ప్రధాని వర్చువల్‌ సమావేశం..