Social Media Viral Video : నిద్రపోతూ కిందపడిపోయిన గున్న ఏనుగు .. వెంటనే స్పందించిన మిగిలిన ఏనుగులు వీడియో వైరల్

స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు జరుగుతున్నా వెంటనే నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ ...

Social Media Viral Video : నిద్రపోతూ కిందపడిపోయిన గున్న ఏనుగు .. వెంటనే స్పందించిన మిగిలిన ఏనుగులు వీడియో వైరల్

Updated on: Feb 28, 2021 | 5:19 PM

Social Media Viral Video : స్మార్ట్ ఫోన్లు, ఇంటర్ నెట్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడ ఏ వింతలు జరుగుతున్నా వెంటనే నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. ఇంకా చెప్పాలంటే జంతువులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు అయితే నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. జంతువులు, పక్షులు చేసే పనులను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు..

సాధారణంగా వైరల్‌ వీడియోస్‌లో కొన్ని ఫన్నీగా, కొన్ని భయానకంగా, మరికొన్ని చాలా ఇంట్రెస్టింగ్‌ గా అనిపిస్తుంటాయి. అయితే తాజాగా ఓ గున్నఏనుగుకు సంబంధించిన ఫన్నీ వీడియో ట్విట్టర్‌లో తెగ వైరల్‌ అవుతోంది. ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్‌ నందా ఈ వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియోలో పెద్ద ఏనుగు వద్ద నిల్చుని ఉన్న గున్న ఏనుగుపిల్ల.. మెల్లగా నిద్రలోకి జారుకుంది. అయితే ఆ సమయంలో పెద్ద ఏనుగు కాలు తాకినట్టు అవ్వడంతోనే వెనకకు పడిపోయింది. దీంతో అక్కడున్న ఏనుగులు అన్ని ఒక్కసారిగా కంగారు పడిపోయాయి. ఈ వీడియోను షేర్ చేసిన ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత్‌ నందా.. ఇది తన సైనిక్ స్కూల్ రోజులను గుర్తుచేస్తోందని తెలిపారు. ఇక, ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా క్యూట్‌గా ఉందంటూ తమదైన స్టైల్‌లో కామెంట్స్‌ పెడుతున్నారు. కాగా ఓ నెటిజన్‌ సరదాగా పాపం ఆ గున్న ఏనుగు రాత్రి నిద్రపోలేదోమోనని కామెంట్ చేశాడు.

Also Read:

How To Find A Lost Phone: స్మార్ట్ ఫోన్ ను పోగొట్టుకుంటే ఎలా దానిని ట్రేస్ చేయాలో తెలుసుకుందాం..!

Janasena in Telangana : సేనాని చూపు తెలంగాణ వైపు .. పార్టీ విస్తరణపై పవన్ సంచలన కామెంట్స్