Viral Video: బుడి బుడి అడుగులతో చిన్న పిల్లలు చేసే అల్లరి చాలా ముద్దుగొలుపుతుంటుంది. వారు ఎంత అల్లరి చేసినా.. ఎంత ఇబ్బంది పెట్టినా ఇష్టంగానే అనిపిస్తుంది తప్ప.. ఏమాత్రం కష్టం అనిపించదు. మనుషులే కాదు.. జంతువులు, పక్షుల్లోనూ చిన్న పిల్లలను చూడముచ్చటగా ఉంటాయి. మనుషులకంటే కూడా జంతువులు, పక్షి పిల్లలు చేసే అల్లరి ఓ రేంజ్‌లో ఉంటుంది. అవి చేసే అల్లరిని చూసేందుకు రెండు కళ్లు కూడా చాలవంతే. తాజాగా ఓ గున్న ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఏనుగు పిల్ల సరదాగా సీమ కోళ్లతో ఆడుకుంటోంది. తప్పటడుగులు వేస్తూ.. పడుతూ లేస్తూ.. అది చేసిన రచ్చ మామూలుగా లేదు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో ఈ అద్భుతమైన వీడియోను షేర్ చేశారు. ‘ఇవి జీవితంలో చిన్నపాటి మధురానుభూతులు’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో.. మైదాన ప్రాంతంలో తల్లి ఏనుగు, పిల్ల ఏనుగు నిల్చుని ఉన్నాయి. అక్కడే సీమ కోళ్లు కూడా ఉన్నాయి. సీమ కోళ్లను చూసిన ఆ గున్న ఏనుగు సంతోషంలో ఉరకలు తీసింది. ఆ సీమ కోళ్ల వెంట పరుగులు తీస్తూ సరదాగా ఆడుకుంటున్నట్లుగా ఉంది. అది వెంట పడుతుండగా.. ఆ సీమ కోళ్లు దాని నుంచి తప్పించుకుంటున్నట్లుగా వీడియోలో చూడొచ్చు. అయితే, ఆ సీమ కోళ్ల వెంటపడిన గున్న ఏనుగు ఒక్కసారిగా పట్టుతప్పి కింద పడిపోయింది. పక్కనే ఉన్న తల్లి ఏనుగు అది చూసి.. గున్న ఏనుగు వద్దకు వస్తుండగా.. అంతలోనే ఆ గున్న ఏనుగు తల్లి ఏనుగు పంచన చేరుతుంది. కాగా, ఈ సీన్‌ను అంతా ఎవరో వీడియో తీశారు. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. దీనిని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. గున్న ఏనుగు సరదా ఆటను చూసి.. నెటిజన్లు తమ బాల్యాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారు. ఆ మేరకు కామెంట్స్ కూడా చేస్తున్నారు. జంతువు అయినా.. మనిషి అయినా.. బాల్యంలో ఉండే సరదానే వేరు అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టారు. కాగా, ఈ వీడియోను జులై 15వ తేదీన ట్విట్టర్‌లో షేర్ చేయగా.. ఇప్పటి వరకు ఈ వీడియోను 64 మందికిపైగా వీక్షించారు. దాదాపు 600 మంది రీట్వీట్ చేశారు. ఎంతో ఉత్సాహం కలిగిస్తున్న ఈ వీడియోను మీరూ చూసేయండి.
Viral Video:
It’s the little things in life? pic.twitter.com/ujFIPInThD
— Susanta Nanda IFS (@susantananda3) July 15, 2021
Also read:
Google Chrome: మీరు గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తున్నారా..?అయితే తక్షణమే అప్‌డేట్ చేసుకోండి
Narendra Modi: ప్రధాని నోట బాహుబలి మాట.. వ్యాక్సిన్ తీసుకుంటే అంత స్ట్రాంగ్‌గా ఉంటారు: నరేంద్రమోదీ
18 బంతుల్లో 88 పరుగులు.. ఫోర్లు, సిక్సర్ల తుఫాన్ సృష్టించిన ఆస్ట్రేలియా ఆటగాడు..!