అయోధ్య రాముని గురించి భక్తులు అనేక రకాలుగా వేడుకుంటున్నారు. రాముని కోసం ఏదో చేయాలనే ఆలోచనతో పార్లే-జీ, మ్యారీగోల్డ్ బిస్కెట్లను 1000కి పైగా ఉపయోగించి.. 3 రోజులు శ్రమించి భక్తితో మందిరాన్ని తయారు చేశారు. రామకోటి కార్యాలయంలో గురువారం నాడు ఆవిష్కరించి రామభక్తిని చాటుకున్నాడు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాముని గురించి ఎన్నో చిత్రాలు చిత్రించానని ఈసారి రాముని గురించి మందిరాన్ని చేశానన్నారు. రామ నామాన్ని మించిన నామం మరొక్కటి లేదన్నారు. నేడు భారతదేశం అంతా కూడా రామనామంలో మునిగి తేలడం రామభక్తికి నిదర్శనం అన్నారు.