Rare Kangaroo: ఓ మహిళ కంట పడిన అరుదైన కంగారూ.. శ్వేత వర్ణంలో మెరిసిపోతూ.. గంతులు

Rare Kangaroo: సోషల్ మీడియాలో(Social media) ప్రతి రోజూ ఏదో ఒక కొత్త అంశం వైరల్‌ అవుతూ ఉంటుంది. ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలూ విశేషాలను సోషల్‌ మీడియా..

Rare Kangaroo: ఓ మహిళ కంట పడిన అరుదైన కంగారూ.. శ్వేత వర్ణంలో మెరిసిపోతూ.. గంతులు
White Kangaroo In Queenslan

Updated on: Apr 27, 2022 | 4:32 PM

Rare Kangaroo: సోషల్ మీడియాలో(Social media) ప్రతి రోజూ ఏదో ఒక కొత్త అంశం వైరల్‌ అవుతూ ఉంటుంది. ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింతలూ విశేషాలను సోషల్‌ మీడియా క్షణాల్లో మనముందుంచుంది. తాజాగా అరుదైన ఓ తెల్ల కంగారూ( white kangaroo) ఫోటో వైరల్ అవుతోంది. దీనిని చూసినవారంతా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి కంగారూలు చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇక్కడ విశేష‌మేమంటే జనాలు ఈ కంగారూని తెగ పొగుడుతూ దాని అందాన్ని చూసి పిచ్చెక్కిపోతున్నారు. స్థానిక మీడియాకు అందిన స‌మాచారం ప్రకారం ఈ తెల్ల కంగారూ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్ శివార్లలో ఒక స్థానికురాలికి కనిపించింది. ఆమె తన భర్తతో కలిసి బయటకు వెళ్లినప్పుడు ఈ తెల్ల కంగారూ కనిపించిదని, దాన్ని చూసి నమ్మలేకపోయానని తెలిపింది.

తెల్లగా మెరిసిపోతూ అలా పరుగులు పెడుతూ పారిపోతుండ‌గా మేము దానికి సంబంధించిన‌ కొన్ని ఫోటోల‌ను క్లిక్ చేశామ‌ని సదరు మహిళ చెప్పింది.ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజ‌న్లు దానిని చూసి షాక్ అయ్యారు.అంతే కాదు ఆ కంగారుపై నెటిజ‌న్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. తానెప్పుడూ తెల్ల కంగారూని చూడలేదని ఒక‌రు అన్నారు.ఇది చాలా అందంగా ఉందని మ‌రొక‌రు అన్నారు.

Also Read: 

Yellow Turtle: బంగారు వర్ణంలో మెరిసిపోతున్న అరుదైన తాబేలు.. ఓ గ్రామంలోని చెరువులో లభ్యం