నువ్వు మాములోడివి కాదు భయ్యా.. పుష్‎అప్ లు చేసి గిన్నిస్ రికార్డు సాధించాడు. ఎన్నంటే

సిక్స్‌ప్యాక్ తో బాడిని మెయింటేన్ చేసేవారు కూడా ప్రతిరోజు 100 పుష్‌అప్‌లు చేస్తే బాగా అలిసిపోతారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి కేవలం గంటలో 3,206 పుష్‌అప్‌లు చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు.

నువ్వు మాములోడివి కాదు భయ్యా.. పుష్‎అప్ లు చేసి గిన్నిస్ రికార్డు సాధించాడు. ఎన్నంటే
Lucas Helmke

Updated on: Apr 17, 2023 | 1:14 PM

సిక్స్‌ప్యాక్ తో బాడిని మెయింటేన్ చేసేవారు కూడా ప్రతిరోజు 100 పుష్‌అప్‌లు చేస్తే బాగా అలిసిపోతారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి కేవలం గంటలో 3,206 పుష్‌అప్‌లు చేసి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు చెందిన 33 ఏళ్ల లుకాస్‌ హెల్మెక్‌ పుష్‌ అప్‌లు చేయడం ద్వారా తనకున్న శక్తి ఏంటో ప్రపంచానికి చూపించి ఫేమస్ అయిపోయాడు.

అయితే ఇంతకు ముందు కూడా ఆస్ట్రేలియాకే చెందిన డేనియల్ స్కాలి అనే వ్యక్తి గంటకు 3,182 పుష్ అప్ లు చేసి రికార్డు సాధించాడు. అయితే ఇప్పుడు లుకాస్ హెల్మేక్ గంటకు 3,306 పుష్ అప్ చేసి ఆ రికార్డుని బద్దలు కొట్టాడు. అయితే లుకాస్ హెల్మేక్ పుష్ అప్ లు చేస్తున్నప్పుడు నిమిషానికి 53 పుష్ అప్ లు చేశాడని గిన్నీస్ వరల్డ్ అధికారులు తెలిపారు. అయితే రికార్డు సాధించండంపై లుకాస్ స్పందించాడు. రెండు మూడేళ్లపాటు అనుభవజ్ఞులైన జిమర్ ల వద్ద శిక్షణ కూడా తీసుకున్నానని వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..