Watch: ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

|

Dec 22, 2024 | 1:16 PM

సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం చాలా మంది వ్యక్తులు మితిమీరి ప్రవర్తిస్తున్నారు. వ్యూస్ రాబట్టేందుకు ఎలాంటి పనులు చేయడానికి కూడా వెనుకడుగు వేయటం లేదు. ఇందుకోసం కొత్త కొత్త పద్దతులను అవలంబిస్తున్నారు. చాలా సార్లు ప్రజలు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక విచిత్రమైన వీడియో వైరల్ అవుతోంది. అది చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

Watch: ఫ్రెండ్స్‌కి పార్టీ అంటూ తల్లిపాలు తాగించిన మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Australian Influencer
Follow us on

విదేశాలలో క్రిస్మస్ వేడుకలు జోరందుకున్నాయి. నెల రోజుల ముందుగా అక్కడ క్రిస్మస్‌ సంబరాలను వైభవంగా జరుపుకుంటారు. అలాంటి వేడుకలకు సంబంధించి ఆస్ట్రేలియా నుండి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో కొంతమంది క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ వీడియోలో సముద్రం మధ్యలో పడవలో తన స్నేహితులతో కలిసి క్రిస్మస్‌ను పార్టీ జరుపుకుంటున్న ఓ లేడీ ఇన్ ఫ్లూయెన్సర్ కూడా ఉన్నారు. క్రిస్మస్‌ పార్టీ సందర్భంగా ఆమె తన స్నేహితులకు తల్లి పాలు తాగించి, ఈ క్రిస్మస్ వేడుకను మరింత గుర్తుండిపోయేలా చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. చాలా మంది ఈ వీడియో స్పందించారు.

ఈ వీడియో sarahs_day అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేయబడింది. వీడియోలో, సారా మొదట తల్లి పాలను తీసేందుకు మెషిన్‌ సాయం తీసుకుంది. బాటిల్‌లో పాలు తీసి తన ఫ్రెండ్స్‌లో ఒకరికి ఇస్తుంది. కొంచెం తాగిన వారు ఓహ్ అని రియాక్షన్ ఇవ్వటం వీడియోలో కనిపించింది. ఆ తర్వాత మరో ఫ్రెండ్‌కి ఆ పాలు ఇస్తారు. ఆమె కూడా కొద్దిగా తాగుతుంది. కానీ అక్కడ ఉన్న సారా భర్త ఒక బిడ్డ పాలు తాగడానికి నిరాకరించారు. కానీ, వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

ఇప్పటికే సారా వీడియోను 14 లక్షలకు పైగా వీక్షించారు. దీనికి 24,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. సారా స్టీవెన్‌సన్‌కు 1.2 మిలియన్ల మంది అనుచరులు ఉన్నారు. చాలా మంది వినియోగదారులు వీడియోను చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు. షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..