తమిళనాడులోని కూనురు నీలగిరి కొండల్లో నిన్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తోపాటు అయన భార్య మధులిక.. మరో 11 మంది సైనిక సిబ్బంది కన్నుమూశారు. ఈ విషయాన్ని వాయుసేన అధికారికంగా ప్రకటించింది. హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రత్యేక్షంగా వీక్షించినవారున్నారు. హెలికాప్టర్ కూప్పకూలిన వెంటనే మంటలు రావడంతో అక్కడే ఉన్న స్థానికులు వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే హెలికాప్టర్ పూర్తిగా కాలిపోవడంతో అందులో మరణించిన వారిని గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది. అయితే హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అయితే రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ఆకాశంలోనే మంటలు చెలరేగాయని.. ప్రమాద దృశ్యాలు ఇవేనంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ హెలికాప్టర్ ఆకాశంలో ఉన్నప్పుడే మంటలు చెలరేగాయి. దీంతో మంటల మధ్యనే దాదాపు రెండు నిమిషాలపాటు హెలికాప్టర్ గాలిలో చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో అందులో ఉన్నవారు కొందరు హెలికాప్టర్ నుంచి దిగే ప్రయత్నం చేశారు. ఇక ఆ తర్వాత గాలిలోనే హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయి నిటారుగా వేగంగా నెలపై పడిపోయింది. అయితే బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రత్యేక్షంగా చూసినవారు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఆకాశంలోనే మంటలు చెలరేగాయని.. అందులో కొందరు హెలికాప్టర్ నుంచి బయటకు దూకేసారని చెబుతున్నారు. దీంతో ఆ హెలికాప్టర్ వీడియో రావత్ ప్రయాణిస్తున్నాదేనంటూ నెట్టింట్లో ప్రచారం మొదలైంది.
కానీ నిజానికి ఆ వీడియో ఇప్పటిది కాదు. 2020 ఫిబ్రవరిలో సిరియాలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన వీడియో. అక్కడ ఆకాశంలో మంటల్లో చిక్కుకున్నప్పుడు వీడియో తీశారు. అయితే ఆకాశంలో కాలిపోయిన ఈ హెలికాప్టర్ వీడియో రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాదని మరికొందరు వాదిస్తున్నారు.
వీడియో..
Bipin Rawat Helicopter Crashed In Tamil Nadu live Video #bipinrawat #helicopter #IndianArmy #BIGBREAKING pic.twitter.com/CgwCqZ0bSr
— Marwadi Club (@MarwadiClub) December 8, 2021