Viral Photo: నూనూగు మీసాల ఈ బాలుడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు మోస్ట్ పవర్‌ఫుల్ మ్యాన్..

ఇంటర్నెట్.. ఇప్పుడు ప్రపంచంలోని ప్రతి మూలకు విస్తరించింది. దీంతో కనెక్టివిటీ పెరిగింది. సినిమా సెలబ్రిటీలు, స్పోర్ట్ స్టార్స్, పొలిటికల్ లీడర్స్.. తమ అభిమానులను, ఫాలోవర్స్ ను రీచ్ అయ్యేందుకు డిజిటల్ ట్రెండ్ బాగా ఉపయోగపడుతుంది.

Viral Photo: నూనూగు మీసాల ఈ బాలుడు ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు మోస్ట్ పవర్‌ఫుల్ మ్యాన్..
Leader Childhood Photo

Updated on: May 19, 2023 | 6:49 PM

Trending Photo: ప్రజంట్ నడుస్తుంది ఇంటర్నెట్ యుగం. ఇప్పుడు డిజిటల్ జనరేషన్‌దే హవా. ఎప్పుటికప్పడు అప్‌డేట్ అవుతూ.. టెక్ ప్రపంచాన్ని ఏలేస్తున్నారు కుర్రాళ్లు. సోషల్ మీడియా వల్ల ఫస్సులు ఎన్ని ఉన్నాయో, మైనస్సులు కూడా అంతే ఉన్నాయ్. సినిమా వాళ్లు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఎక్కువగా హల్‌చల్ చేస్తుంటారు. వారిని పక్కన బెట్టండి. ఈ మధ్య పొలిటిషియన్స్ కూడా అప్ డేట్ అయ్యారు. అంతెందుకు ప్రభుత్వాలను పడగొట్టి, నిలబెట్టే స్థాయికి సోషల్ మీడియా ఎదిగింది. అందుకే పొలిటికల్ లీడర్స్ తమ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉండేందుకు ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ వంటి అన్ని వేదికలను వాడేస్తున్నారు.

పలు అంశాలపై తమ పార్టీ స్టాండ్ ఏంటో తెలిపేందుకు, డెవలప్‌మెంట్ వర్క్స్, సోషల్ సర్వీసులకు సంబంధించిన విషయాలను జనాల్లోకి తీసుకెళ్లెందుకు సామాజిక మాధ్యమాలను వినియోగిస్తన్నారు లీడర్స్. ఈ క్రమంలోనే రాజకీయ నాయకుల చిన్ననాటి ఫోటోలు నెట్టింట వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. అందులో వారిని చూసి.. ఇప్పుడు ఫలానా వ్యక్తి అంటే కొందరు అస్సలు గుర్తించలేకపోతున్నారు. ప్రజంట్ మీ ముందుకు ఓ త్రో బ్యాక్ ఫోటో పట్టుకొచ్చాం. ఈ ఫోటోలోని బాలుడు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో శక్తివంతమైన వ్యక్తి. అపారమైన క్రేజ్ ఉన్న పొలిటికల్ లీడర్. ఇప్పటికే చాలామంది గుర్తుపట్టి ఉంటారు. ఆయన ఆంధ్ర రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి.

ఈ ఫోటోలోని నూనూగు మీసాల కుర్రాడు ఇప్పుడు ఏపీని సంక్షేమ పథంలో ముందుకు తీసుకెళ్తున్న జగన్. తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ఆర్ అకాల మరణం తర్వాత.. కొన్నాళ్లు కాంగ్రెస్ లో ఉండి.. 2011లో ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’తో ప్రజల్లోకి వచ్చారు జగన్. 2014లో పోటీ చేసినప్పటికీ ఆయన ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.  ఆ తర్వాత రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో జగన్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది.. రికార్డు క్రియేట్ చేశారు. తన తండ్రి అడుగుజాడల్లో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ముందుకు సాగుతున్నారు.

CM YS Jagan

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ పై క్లిక్ చేయండి..