Viral: ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వకాలు.. 6 అడుగుల మేర తవ్వగా కనిపించిన అద్భుతం

|

Aug 24, 2022 | 3:48 PM

రాజస్థాన్‌లో అరుదైన ఘటన వెలుగుచూసింది. ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వతుండగా ఓ పురాతన శివలింగం బయల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి.

Viral: ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వకాలు.. 6 అడుగుల మేర తవ్వగా కనిపించిన అద్భుతం
Foundation Excavation (representative image)
Follow us on

Trending: పురాతన ఇళ్లు కూల్చివేసినప్పుడు, ఇళ్ల నిర్మాణాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు.. పురాతన నిధి, పురాతన దేవుళ్ల విగ్రహాలు బయటపడిన ఘటనల గురించి మనం అరుదుగా వింటూ ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే రాజస్థాన్‌(rajasthan)లో వెలుగుచూసింది. బేవార్(beawar) నగరంలోని ఆశాపురా మాత ఆలయం వెనుక ఉన్న భాటి కాలనీలో ఓ ఇంటి నిర్మాణం కోసం పునాది తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలోనే 6 అడుగుల మేర తవ్వగా లోపల శివలింగం కనిపించింది. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఓం నమ:శివాయ అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. శివలింగం బయల్పడిన సమాచారం అందిన వెంటనే భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు.  భాటి కాలనీ అభివృద్ధి కమిటీ సభ్యులు సదరు శివలింగాన్ని సమీపంలో ఉన్న స్థలంలో ప్రతిష్టించి పూజించారు. నీరు, పాలతో అభిషేకం చేశారు.  నగర పాలక సంస్థ కమిషనర్‌ను కలిసి శివలింగం బయటపడిన సమీప ప్రాంతంలో ఆలయ నిర్మాణానికి అనుమతి కోరనున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. కాగా శ్రావణ మాసంలో శివుడు ఇలా తమ ప్రాంతంలో వెలసి దర్శనం ఇచ్చాడని అక్కడి స్థానికులు మురిసిపోతున్నారు.

Ancient Shivling

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..